Site icon NTV Telugu

Super Splendor Canvas Black Edition : బైక్‌ ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. ఈ మోడల్‌ అదిరింది

Super Slender Canvas Black

Super Slender Canvas Black

Super Splendor Canvas Black Edition Released
ప్రముఖ టూవీలర్‌ దిగ్గజం సంస్థ హీరో కంపెనీ కొత్తగా స్ల్పెండర్‌ మోడల్‌లో ఒక సూపర్‌బైక్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. రెండు వేరియంట్లలోలభించనున్న వీటి ధరలను ప్రకటించింది హీరో కంపెనీ. బేస్ డ్రమ్ సెల్ఫ్-కాస్ట్ వేరియంట్ ధరను రూ. 77,430 (ఎక్స్-షోరూమ్)గానూ, డిస్క్ సెల్ఫ్-కాస్ట్ వేరియంట్ ధరను రూ. 81,330 (ఎక్స్-షోరూమ్)గా ఉంచింది కంపెనీ. ఇంజన్‌ ప్రీమియం బోల్డ్ డిజైన్ , అప్‌డేటెడ్‌ టెక్నాలజీతో, కొత్త హీరో సూపర్ స్ప్లెండర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. లీటరుకు 60-68 కిలీమీటర్ల సెగ్మెంట్‌లో అత్యుత్తమ మైలేజీతో 13 శాతం వరకు మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుందని హీరో వెల్లడించింది. ఈ బైక్‌లోని 125cc, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ 7500 RPM వద్ద 10.7 HP , 6000 RPM వద్ద 10.6 Nm శక్తిని అందిస్తుంది.

 

డిస్క్ బ్రేక్, కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (CBS)తో హీరో సూపర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్‌ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. డీజీ-అనలాగ్ క్లస్టర్, ఇంటిగ్రేటెడ్ యూఎస్‌బీ ఛార్జర్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ ఉన్నాయి. 5 సంవత్సరాల వారంటీతో పాటు, గ్రాఫిక్స్‌తో కస్టమర్‌లు కస్టమైజ్‌ చేసుకునే అవకాశం కూడా కంపెనీ కల్పించింది. అధునాతన ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఇంజన్‌తో పాటు, వెట్ మల్టీ ప్లేట్ క్లచ్, సరికొత్త 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ని అందించింది హీరో కంపెనీ.

 

Exit mobile version