Site icon NTV Telugu

Sunrisers Leeds: జట్టు పేరును మార్చేసిన కావ్య మారన్.. కొత్త పేరేంటంటే..?

Sunrisers

Sunrisers

Sunrisers Leeds: ఏంటి.. కావ్య మారన్ యజమానురులుగా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పేరు మారిందని అనుకుంటున్నారా..? ఆబ్బె.. అదేం కాదండి.. కాకపోతే పెరుమారింది మాత్రం కావ్య మారన్ యజమానురులుగా ఉన్న జట్టు పేరే. ఏంటి మళ్లీ కన్ఫ్యూజ్ అయ్యారా..? ఆగండి.. ఆగండి.. అసలు మ్యాటర్ ఏంటంటే..

VW Smart QLED Android TV: ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ.. రూ.10,999కే 40 అంగుళాల స్మార్ట్ టీవీ.. !

ఇంగ్లాండ్‌లోని ప్రముఖ క్రికెట్ టోర్నమెంట్ ‘ది హండ్రెడ్’ (The Hundred)లో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. భారతీయ మీడియా దిగ్గజం సన్ గ్రూప్ పూర్తిస్థాయి యాజమాన్యాన్ని స్వీకరించడంతో ఇప్పుడు అందులో ఉన్న ‘నార్తర్న్ సూపర్‌ చార్జర్స్’ జట్టు పేరు అధికారికంగా ఇప్పుడు ‘సన్‌రైజర్స్ లీడ్స్’ (Sunrisers Leeds)గా మార్చబడింది. 2026 సీజన్‌కు ముందు ఆధారిత జట్టు కొత్త పేరుతో బరిలోకి దిగనుంది. యాజమాన్యం మార్పు, రీబ్రాండింగ్ ప్రక్రియలో భాగంగా.. సన్ గ్రూప్ 2025 ప్రారంభంలో యార్క్‌షైర్, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) వాటాలను 100 యూరో మిలియన్లకు పైగా మొత్తానికి కొనుగోలు చేసి ఈ ఫ్రాంచైజీపై పూర్తి అధికారం సాధించింది. ఈ అధికారిక పేరు మార్పు అక్టోబర్ 31, 2025న UKలోని కంపెనీస్ హౌస్‌లో దాఖలైంది.

Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!

ఈ రీబ్రాండింగ్‌తో సన్ గ్రూప్ తన ప్రపంచవ్యాప్త క్రికెట్ బ్రాండ్‌లను ఒకే గూటిలోకి తీసుక వచ్చింది. ఇప్పటికే ఈ గ్రూప్‌కి సన్‌రైజర్స్ హైదరాబాద్ (IPL), సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ (SA20) జట్లు ఉన్నాయి. తాజాగా వీటిలో సన్‌రైజర్స్ లీడ్స్ (The Hundred) కూడా చేరింది. 2026 సీజన్‌కు ముందు ‘ది హండ్రెడ్’లో జరుగుతున్న పునర్నిర్మాణంలో ఈ పేరు మార్పు ఒక భాగం. సన్‌రైజర్స్ లీడ్స్ తో పాటు, మాంచెస్టర్ ఒరిజినల్స్ పేరు మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ గా, ఓవల్ ఇన్విన్సిబుల్స్ పేరు MI లండన్ గా మారే అవకాశం ఉంది. ఈ మార్పులు కొత్త యాజమాన్య నిర్మాణాలు, బ్రాండింగ్ వ్యూహాలను బట్టి మారనున్నాయి.

Exit mobile version