ఐపీఎల్ 2025 సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్ విడుదలైంది. సన్‌రైజర్స్ మార్చి 23న (ఆదివారం) రాజస్థాన్ రాయల్స్‌తో హైదరాబాద్ ఉప్పల్ వేదికగా తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత.. 27న లక్నో సూపర్ జెయింట్స్‌తో ఉప్పల్ లో తలపడనుంది. మార్చి 30న విశాఖలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. ఏప్రిల్ 3న కోల్‌కతాలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ జరుగనుంది. ఏప్రిల్ 6న ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది.
Read Also: Mohan Bhagwat: ఆర్‌ఎస్ఎస్ నెక్ట్స్ టార్గెట్ ఇదే.. సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం
ఏప్రిల్ 12న పంజాబ్ కింగ్స్‌తో ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ మ్యాచ్ జరుగుతుంది. ఏప్రిల్ 17న ముంబై వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది , ఏప్రిల్ 23న ఉప్పల్ వేదికగా ముంబ ఇండియన్స్‌తో ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ జరుగనుంది. ఏప్రిల్ 25న చెన్నై చెపాక్ స్టేడియంలో సీఎస్కేతో మ్యాచ్ ఆడనుంది. మే 2న గుజరాత్ టైటాన్స్‌తో అహ్మదాబాద్ వేదికగా సన్ రైజర్స్ తలపడనుంది. మే 5న ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ జరుగనుంది. మే 10న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. మే 13న ఆర్సీబీతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో సన్ రైజర్స్ మ్యాచ్ ఉండనుంది. మే 18న లక్నోలో లక్నో సూపర్ జెయింట్స్‌తో లీగ్ మ్యాచ్‌లో చివరి మ్యాచ్ ఆడనుంది. కాగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ హోంగ్రౌండ్‌లో 7 మ్యాచ్‌లు ఆడనుంది. దీంతో.. ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌కు ఫుల్ ఎంజాయ్‌మెంట్.
Read Also: IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచ్ ఆర్సీబీ-కేకేఆర్, ఫైనల్ మే 25