ఐపీఎల్-2022 తర్వాత టీమ్స్ అన్నీ కొత్త ఆటగాళ్లతో కళకళలాడుతున్నాయి. వేలానికి ముందు కొందరు ప్లేయర్స్‌ను వదులుకున్న ఫ్రాంచైజీలు మినీ వేలంలో కొత్త ఆటగాళ్లను తీసుకున్నాయి. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ గతేడాది మెగావేలంలో ఎడాపెడా ప్లేయర్లను కొనుగోలు చేసి విమర్శల పాలైంది. కానీ ఈ సారి మాత్రం ఆచితూచి ఆడుగేసింది. హ్యారీ బ్రూక్ వంటి పవర్ హిట్టర్ కోసం భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టింది. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ గత సీజన్ కంటే కూడా మెరుగ్గానే కనిపిస్తుంది. అయితే విలియమ్సన్ జట్టులో లేకపోవడంతో తర్వాతి కెప్టెన్ ఎవరనే చర్చ అభిమానుల్లో నడుస్తుంది.
Also Read: INDvsAUS Test: బోర్డర్-గవాస్కర్ సిరీస్ ఆ జట్టుదే.. మాజీ క్రికెటర్ కామెంట్స్
ఈ విషయంలో టీమ్ ఓనర్ కావ్య మారన్‌కు ఇప్పటికే ఒక ఆలోచన వచ్చిందని సమాచారం. సౌతాఫ్రికా ప్లేయర్ మర్క్‌రమ్‌ను హైదరాబాద్ కెప్టెన్‌గా చేయాలనుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు మర్క్‌రమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ టోర్నీ ఆఖరి స్టేజ్‌కు చేరుకోగా.. ఈస్టర్న్ కేప్‌ను అతడు దాదాపు సెమీస్‌కు చేర్చాడు. వాస్తవానికి ఈ లీగ్‌ను సన్ రైజర్స్ పేలవంగా ఆరంభించింది. ఆరంభంలో వరుసగా రెండు మ్యాచ్‌లో ఓడి నిరాశ పరిచింది. అయితే అనంతరం తన కెప్టెన్సీతో జట్టుకు హ్యాట్రిక్ విజయాలను సాధించి పెట్టాడు మర్క్‌రమ్. ఈ లీగ్‌లో మర్క్‌రమ్ ఈస్టర్న్ కేప్‌ను ఛాంపియన్‌గా నిలబెడితే ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌లో అతడు సన్ రైజర్స్ హైదరాబాద్‌కు సారథిగా వ్యవహరించే ఛాన్స్ ఉంది. అలా జరగకపోయినా ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకునే వారిలో అతడికే ఎక్కువ ఛాన్స్ కనిపిస్తోంది.
Also Read: Grammy Awards: 2023 గ్రామీ అవార్డ్స్ గెలుచుకుంది వీళ్లే…