సందీప్ కిషన్ 31వ సినిమాగా తెరకెక్కబోతున్న సినిమాకు సంబంధించి ఈరోజు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్ర బంధం. సెన్సేషనల్ హిట్ సాధించిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ దర్శకుడు స్వరూప్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Also Read: Delhi Police: విరాట్ కోహ్లీ- గౌతమ్ గంభీర్ మధ్య గొడవపై ఢిల్లీ పోలీసులు చేసిన పోస్ట్ వైరల్..
ఎప్పటికప్పుడు కొత్త కథలను ఎంచుకుంటూ వైవిధ్యమైన సినిమాలను తీస్తున్న సందీప్ కిషన్ మరోసారి కొత్త ప్రయత్నానికి నాంది పలికాడు. సెన్సషనల్ డైరెక్టర్ స్వరూప్ యాక్షన్ థ్రిల్లర్ ను తన స్టైల్ లో ఎలా తెరకెక్కిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాను కూడా తనదైన శైలిలో కమర్షియల్ హంగులతో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు రాహుల్ యాదవ్ నిర్మాతగా వహించబోతున్నారు.
Also Read: Nithiin’s Robinhood: సరికొత్త లుక్ లో నితిన్.. ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడే..!
ఈ చిత్రానికి ‘వైబ్’ అనే ఆసక్తికరమైన టైటిల్ చిత్ర బృందం ఎంచుకుంది. ఇకపోతే ఈ సినిమా పోస్టర్ చూస్తే.. పరిస్థితులు అద్భుతప్పినప్పుడు హింస మార్గాన్ని అనుసరించే విధంగా హీరో తన స్నేహితులతో కలిసి పోరాడే విధంగా సినిమా కథ అని తెలుస్తోంది. పోస్టర్ లో హీరో సందీప్ కిషన్ తో పాటు తన ఫ్రెండ్స్ కూడా ఏదో యుద్ధానికి రెడీ అవుతున్నట్లుగా కనబడుతోంది. ఇక భారీ యాక్షన్ తో పాటు కాలేజ్ బ్యాక్ డ్రాప్ వైపు సినిమా తెరకెక్కబోతోంది. ఇక సందీప్ కిషన్ తాజాగా నటించిన ఊరి పేరు భైరవకోన సూపర్ హిట్ సొంతం చేసుకోవడంతో అదే ఫామ్ ను కొనసాగించాలని ఎదురు చూస్తున్నాడు.