NTV Telugu Site icon

Sundaram Master : హిట్ కొట్టాడుగా.. సుందరం మాస్టర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Sundaram Master

Sundaram Master

యూట్యూబ్ లో షార్ట్ వీడియోలు చేస్తూ చాలా మంది బాగా పాపులర్ అయ్యారు.. ఆ తర్వాత సినిమాల్లో కూడా ఛాన్స్ లు అందుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు.. అందులో వైవా హర్ష కూడా ఒకరు.. వచ్చిన అవకాశం ను వాడుకుంటూ ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేశారు. కంటతడి పెట్టించారు. ఇప్పుడు ‘సుందరం మాస్టర్’ సినిమాతో వైవా హర్ష హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆర్.టీ. టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మించిన చిత్రమిది. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. ఇందులో దివ్య శ్రీపాద హీరోయిన్ గా నటించింది.. సరికొత్త కథతో ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది..

ఈ సినిమా మొదటి షో తో మంచి టాక్ ను అందుకోవడంతో పాటు కలెక్షన్స్ ను కూడా బాగానే అందుకుందని సినీ ప్రముఖులు చెబుతున్నారు.. సినిమా టీజర్, ట్రైలర్స్ రిలీజ్ చేసినప్పటి నుంచి సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక రిలీజ్ డే మొదటి ఆట నుంచి సుందరం మాస్టర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచానికి సంబంధం లేని ఓ ఊరికి ఇంగ్లీష్ మాస్టర్ గా వెళ్లి సుందరం మాస్టర్ పడ్డ కష్టాలు, నేర్చుకున్న జీవిత పాఠాలతో ఈ సినిమా సాగుతుంది. హీరోగా మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ కొట్టాడు వైవా హర్ష..

ఈ సినిమా టాక్ తో పాటు కలెక్షన్స్ కూడా బాగానే ఉన్నాయి.. మొదటి రోజు కలెక్షన్స్ ను చూస్తే.. 2.03 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఓ చిన్న సినిమా, కమెడియన్ హీరోగా మారి చేసిన సినిమా మొదటి రోజే ఈ రేంజ్ లో కలెక్షన్స్ సాధించడం అంటే విశేషమే. మొత్తానికి సుందరం మాస్టర్ సక్సెస్ కొట్టాడు. వైవా హర్ష అదుర్స్ అనిపించాడు. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..