Site icon NTV Telugu

Sundaram Master Twitter Review: సుందరం మాస్టర్ ట్విట్టర్ రివ్యూ.. బొమ్మ హిట్టా?

Sundaram Master

Sundaram Master

యూట్యూబ్ లో షార్ట్ వీడియోలు చేస్తూ చాలా మంది బాగా పాపులర్ అయ్యారు.. ఆ తర్వాత సినిమాల్లో కూడా ఛాన్స్ లు అందుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు.. అందులో వైవా హర్ష కూడా ఒకరు.. వచ్చిన అవకాశం ను వాడుకుంటూ ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేశారు. కంటతడి పెట్టించారు. ఇప్పుడు ‘సుందరం మాస్టర్’ సినిమాతో వైవా హర్ష హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆర్.టీ. టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మించిన చిత్రమిది. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. ఇందులో దివ్య శ్రీపాద హీరోయిన్ గా నటించింది.. సరికొత్త కథతో ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం..

సుందరం మాస్టర్ సినిమా ఫస్టాఫ్ సూపర్ అని పలువురు నెటిజనులు ట్వీట్ చేస్తున్నారు. ముఖ్యంగా కథా నేపథ్యం కొత్తగా ఉందని చెబుతున్నారు. హర్షతో పాటు మిగతా నటీనటులు అందరూ నవ్వించారని, ఇంగ్లీష్ స్పెల్లింగ్ సీన్ చూసినప్పుడు కడుపుబ్బా నవ్వుకుంటారు. ఈ సినిమా కామెడీ కడుపుబ్బా నవ్విస్తుందని జనాలు అభిప్రాయ పడుతున్నారు..

ఇకపోతే ఇంటర్వెల్ ముందు ఆడియన్స్ ను బాగా నవ్వించిన సుందరం మాస్టర్… తర్వాత అంతగా కామెడీ చేయలేదని టాక్ వినబడుతోంది. సెకండాఫ్ అంతా ఫిలాసఫీ ఎక్కువ ఉందని, ఆ సన్నివేశాలను సరిగా తీయడంలో ఫెయిల్ అయ్యారని టాక్. స్టోరీ ఐడియా, కొన్ని సీన్లు బాగున్నప్పటికీ… సినిమాలో సోల్ మిస్ అయ్యిందని కామెంట్లు చేస్తున్నారు.

ఆ సన్నివేశాలను సరిగా తీయడంలో ఫెయిల్ అయ్యారని టాక్.. స్టోరీ ఐడియా, కొన్ని సీన్లు బాగున్నప్పటికీ… సినిమాలో సోల్ మిస్ అయ్యిందని కామెంట్లు చేస్తున్నారు. మెజారిటీ ప్రేక్షకులు హర్ష చెముడు నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.. మొదటి షో ప్రస్తుతం పాజిటివ్ దూసుకుపోతుంది.. ఇక కలెక్షన్స్ ఏ విధంగా ఉంటుందో చూడాలి..

Exit mobile version