Site icon NTV Telugu

Summer Holidays: అంగ‌న్వాడీ చిన్నారుల‌కు వేసవి సెల‌వులు ప్రకటన..!

Summer Holidays

Summer Holidays

Summer Holidays: రాష్ట్రంలోని అంగ‌న్వాడీ చిన్నారుల‌కు మంత్రి సీత‌క్క ఆదేశాల మేర‌కు నెల రోజుల పాటు సెల‌వులు ప్రకటించారు. తల్లిదండ్రులు, అంగ‌న్వాడీ యూనియ‌న్ల విజ్ఞ‌ప్తి మేర‌కు ప్ర‌భుత్వం సెల‌వులు ప్రకటించింది. మ‌హిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ క‌మిష‌న‌రేట్ లో బుధ‌వారం నాడు అంగ‌న్వాడీ యూనియ‌న్ల‌తో డైరెక్ట‌ర్ కాంతి వెస్లీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎండ‌లు మండుతున్న నేప‌థ్యంలో మే 1 నుంచి సెల‌వులు ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే అంగ‌న్వాడీ ల‌బ్దిదారుల‌కు పౌష్టికాహారం అందించేలా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అంగ‌న్వాడీ చిన్నారుల‌కు, గ‌ర్భిణుల‌కు, బాలింత‌ల‌కు టేక్ హోం రేష‌న్ ద్వారా గుడ్లు, స‌రుకుల‌ స‌ర‌ఫ‌రా చేయనున్నారు.

Read Also: Bandi Sanjay Kumar: గ్రూప్-1 అక్రమాలపై రంగంలోకి బండి సంజయ్..!

సెల‌వుల కాలంలో అంగ‌న్వాడీ టీచ‌ర్ల‌కు ఇత‌ర విధులు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇంటింటి స‌ర్వే, హోం విసిట్స్, అంగ‌న్వాడీలో చేర్చే చిన్నారుల గుర్తింపు వంటి విధుల‌ను విధిగా నిర్వ‌ర్తించాల‌ని టీచ‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేసారు. ఈ ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో వేస‌వి నుంచి ల‌బ్దిదారుల‌కు, సిబ్బందికి కాస్త ఉప‌శ‌మనం లభించనుంది. అంగ‌న్వాడీ చ‌రిత్ర‌లోనే తొలి సారిగా సెల‌వులు ఇవ్వడంతో, త్వ‌ర‌లో ఉత్త‌ర్వులు ఇవ్వనునట్లు అధికారులు తెలిపారు. అంగ‌న్వాడీల‌కు సెల‌వులు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వానికి, చొర‌వ చూపిన మంత్రి సీత‌క్క‌కు అంగ‌న్వాడీ యూనియ‌న్లు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపాయి.

Exit mobile version