Site icon NTV Telugu

పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం

పారాలింపిక్స్‌ లో భారత అథ్లెట్లు తమ జోరు ను కొనసాగిస్తున్నారు. తాజాగా భారత్‌ కు మరో స్వర్ణ పతకం వచ్చింది. జావెలిన్‌ త్రో లో సుమిత్‌ అంటిల్‌ కు స్వర్ణ పతకం వచ్చింది. 68. 55 మీటర్లు విసిరి వరల్డ్‌ రికార్డు సృష్టించాడు సుమిత్‌ అంటిల్‌. దీంతో సుమిత్‌ అంటిల్‌ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. కాగా… మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో ‘అవని లేఖరా’ గోల్డ్ గెలిచిన సంగతి తెలిసిందే.. దాంతో పారాలింపిక్స్ లో గోల్డ్‌ గెలిచిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. లేఖరా ఫైనల్‌లో మొత్తం 249.6 స్కోరు సాధించింది. ఇక తాజాగా జావెలిన్‌ త్రో లో సుమిత్‌ అంటిల్‌ కు స్వర్ణ పతకం వచ్చింది. దీంతో భారత్‌ ఖాతాలో మొత్తం రెండు బంగారు పతకాలు వచ్చినట్లయింది.

Exit mobile version