NTV Telugu Site icon

Suma Kanakala: అమ్మ బాబోయ్.. సుమ డ్యాన్స్ ఇరగదీసిందిగా.. వీడియో చూస్తే..

Sumkka

Sumkka

బుల్లితెర జేజేమ్మ యాంకర్ సుమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. అంతగా పాపులారిటిని సొంతం చేసుకుంది.. బుల్లితెర ప్రేక్షకులకు ఆమె కనిపిస్తే చాలు ఆ షో, ఈవెంట్ లకు అతుక్కుపోతుంది… ఆమె ఓ ట్రెండ్ సెట్ చేశారు. మొదటి తరం తెలుగు యాంకర్స్ లో ఒకరైన సుమ ఎన్నో ఏళ్లుగా రాణిస్తున్నారు.. ఆమెతో పాటు యాంకర్స్ గా వెలుగొందిన ఉదయభాను, ఝాన్సీ కొంచెం నెమ్మదించారు. సుమ మాత్రం దశాబ్దాలుగా జోరు చూపిస్తున్నారు. నాలుగైదు భాషల మీద పట్టు, సమయస్ఫూర్తి సుమను బెస్ట్ యాంకర్ చేశాయి.

కొన్ని ఐకానిక్ షోస్ కి ఆమె యాంకర్ గా చేశారు. ఓ స్టార్ హీరోయిన్ కి ఏమాత్రం తగ్గని స్టార్డం ఆమె సొంతం.. సుమ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. తాజాగా ఓ డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేసింది.. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఓ పాటకు డాన్స్ చేస్తూ అద్భుతమైనటువంటి పర్ఫామెన్స్ ఇచ్చారు. లంగా వోణీలో డాన్స్ పెర్ఫార్మెన్స్ కి సంబంధించిన వీడియోని ఈమె ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఇందులో భాగంగా ఈమె చేసినటువంటి డాన్స్ అద్భుతంగా ఉండడంతో ఎంతోమంది సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా సుమ డాన్స్ వీడియో పై విభిన్న రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

అంతేకాదు సింగర్ గీతామాధురి నటి పాయల్ రాజ్ పుత్ వంటి వారందరూ కూడా సుమ డాన్స్ పెర్ఫార్మెన్స్ పై కామెంట్లు చేస్తూ ప్రశంశలు కురిపిస్తున్నారు.. అలాగే నెటిజన్లు కూడా సుమ డ్యాన్స్ ను మెచ్చుకోకుండా ఉండలేరు.. యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈమె తాజాగా తన డాన్స్ తో అద్భుతమైన డాన్సర్ అని కూడా అనిపించుకున్నారని చెప్పాలి.. సుమ ప్రస్తుతం వరుస షోలు, ఈవెంట్స్ చేస్తూ బిజీగా ఉన్నారు..