NTV Telugu Site icon

Vijay Devarakonda : సుక్కుతో విజయ్ దేవరకొండ సినిమా?

Vijay Devarakona Sukumar B

Vijay Devarakona Sukumar B

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి అందరికీ తెలుసు.. రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు… ఆ సినిమా అనుకున్న రిజల్ట్ ను ఇవ్వలేక పోయింది.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. రౌడీ హీరో లైనప్ మహా గొప్పగా ఉంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ మీద గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మూవీ, దిల్ రాజు నిర్మాతగా రవికిరణ్ కోలాతో చేయబోయే చిత్రం, రాహుల్ సంకృత్యాన్ తో లాక్ చేసుకున్న పీరియాడిక్ డ్రామా గా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు..

ఇప్పుడు మరో మూవీని లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది.. మూడేళ్ళ క్రితమే విజయ్ దేవరకొండ దర్శకుడు సుకుమార్ కలయికలో ఒక సినిమాను అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే.. దానిపై ఎటువంటి అప్డేట్ తర్వాత రాలేదు. ఇన్నాళ్లకు మళ్ళీ ఆ కాంబో గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. ప్రస్తుతం సుక్కు పుష్ప 2 చేస్తున్నాడు… ఆ సినిమా అవ్వగానే రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు.. ఈ రెండు సినిమాలు మరో ఏడాది వరకు ఉంటాయాని తెలుస్తుంది.

అయితే ఆనంద్ దేవరకొండ నటించిన గంగం గణేశా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత వంశీ కారుమంచి మాట్లాడుతూ కొంత ఆలస్యమైనా విజయ్ సుకుమార్ కాంబోలో సినిమా చేస్తామని ఒక క్లారిటీ ఇచ్చారు. దాంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక సుకుమార్ తిరిగి రామ్ చరణ్ కోసం ఎంతలేదన్నా రెండు మూడు సంవత్సరాలు కేటాయించాల్సి ఉంటుంది. అప్పటికి విజయ్ దేవరకొండ మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు.. ఇప్పుడు ఫ్యాన్స్ సంబరపడిన కూడా అప్పటికి ఈ కాంబో సినిమా ఉంటుందో లేదో చూడాలి..

Show comments