Site icon NTV Telugu

Pushpa 2 : క్లైమాక్స్ సీన్ కోసం భారీగా ప్లాన్ చేస్తున్న సుకుమార్..?

Whatsapp Image 2023 07 04 At 8.50.04 Pm

Whatsapp Image 2023 07 04 At 8.50.04 Pm

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన పుష్ప ది రైజ్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించింది. ఈ సినిమాను క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ భారీ స్థాయిలో తెరకెక్కించాడు.ఈ సినిమాతో అల్లుఅర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు.ఈ సినిమా నార్త్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.ఈ చిత్రం కు కొనసాగింపుగా పుష్ప ది రూల్ ను తెరకెక్కిస్తున్నాడు సుకుమార్.. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి గా చూస్తున్నారు.ముఖ్యంగా సౌత్ ప్రేక్షకుల కంటే ఎక్కువగా నార్త్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. పుష్ప ది రూల్ సినిమాను సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తున్న విషయం తెలిసిందే.మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప ది రైజ్ సినిమాలో దేవిశ్రీ అందించిన పాటలు చాట్ బస్టర్ గా నిలిచాయి..ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ అందుకుంది.ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా నుండి తాజాగా మరొక అప్డేట్ బయటకు వచ్చింది. పుష్ప 2 కు సంబంధించిన కీలక సీన్స్ ను ఇప్పటికే తెరకెక్కించిన సుకుమార్ ఇప్పుడు బ్యాలెన్స్ గా ఉన్న క్లైమాక్స్ సీక్వెన్స్ ను తెరకెక్కించేందుకు భారీ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.. ఈ క్లైమాక్స్ షూట్ కోసం భారీ సెట్ ను వేయిస్తున్నారని ఈ సీక్వెన్స్ లో రష్మిక పాత్రకు సంబంధించిన డెత్ మిస్టరీ రివీల్ అవుతుంది అని సమాచారం… మరి క్లైమాక్స్ ను సుకుమార్ భారీ స్థాయిలోనే ప్లాన్ చేసినట్టు సమాచారం.మరి ఈ సినిమా విడుదల అయిన తరువాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Exit mobile version