Sudigali Sudheer:చిన్నచిన్న టీవీ షోలు చేసుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న వ్యక్తి సుడిగాలి సుధీర్. ఇప్పుడు టాలీవుడ్‌లో సుడిగాలి సుధీర్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన ఒక పక్క బుల్లితెరపై యాంకర్‌గా చేస్తూనే వెండి తెరపై హీరోగా సినిమాలు చేస్తున్నారు. తాజాగా సుడిగాలి సుధీర్ హీరోగా జైశ్నవ్ ప్రొడక్షన్, మాహాతేజ క్రియేషన్స్‌లో మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మాణంలో వస్తున్న G.O.A.T సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
READ ALSO: Supreme Court: అది ప్రేమ, కామం కాదు.. “పోక్సో కేసు”లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ.. క్రికెట్ నేపథ్యంలోనే కామెడీ ప్రధాన అంశంగా సుడిగాలి సుధీర్, దివ్యభారతి ప్రధాన పాత్రధారులుగా G.O.A.T మూవీ రూపొందినట్లు, ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్లు ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకి చేరుకున్నాయని వెల్లడించారు. నిర్మాత మొగుళ్ళ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని, తను నిర్మించిన సినిమాలలో మంచి చిత్రంగా ఈ సినిమా నిలుస్తుందని తెలియజేశారు. త్వరలోనే టీజర్, పాటలు, అన్నీ అప్డేట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చెప్పారు. ఈ సినిమాను త్వరలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
READ ALSO: MVA Protest Mumbai: ముంబైలో మహా వికాస్ అఘాడి నిరసన..
