Site icon NTV Telugu

Delhi: దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసిన దుమ్ము తుఫాన్.. దారి కనిపించక ప్రజలు ఇబ్బందులు

Duststorm

Duststorm

దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఉదయం భారీ దుమ్ము తుఫాన్ కప్పేసింది. ఒక్కసారిగా ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది. నగరమంతా దుమ్ము తుఫాన్ కప్పేసింది. దీంతో ప్రజలు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దారి కనిపించక నానా తంటాలు పడ్డారు. రోడ్లపై ప్రయాణించే వాహనదారులైతే రహదారులు కనపించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తక్కువ దూరం రోడ్డు కూడా స్పష్టంగా కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ముఖ్యంగా డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలు నడపాలని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: IPS Couple Wedding: ఐపీఎస్‌ల పెళ్లితో ఎస్పీలో కుంపటి.. యూపీలో రాజకీయ దుమారం

ఢిల్లీని తీవ్ర తుఫాన్ ఆవహించనుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. రోజంతా మేఘావృతమై కొన్నిచోట్ల స్వల్ప జల్లులు పడే అవకాశముందని… మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో గంటకు 20–30 కి.మీ వేగంతో గాలులు వీచి.. 40 కి.మీ వరకు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

వర్ష సూచన..
ఏప్రిల్ 4 నుంచి 5 మధ్య ఒకటి లేదా రెండు సార్లు స్వల్ప నుంచి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని… ఈ సమయంలో ఉరుములు, మెరుపులు ఉంటాయని.. గంటకు 40–50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ 6న మేఘావృతమై పెద్దగా వర్షం ఉండకపోవచ్చని పేర్కొంది. ఇక ఏప్రిల్ 7, 8 తేదీల్లో మళ్లీ స్వల్ప వర్షం, ఉరుములతో కూడిన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని.. ముఖ్యంగా దుమ్ము తుఫాన్ సమయంలో బయటకు వెళ్లేటప్పుడు మాస్క్‌లు ధరించాలని అధికారులు సూచించారు.

Exit mobile version