Subbalakshmi Died: సీనియర్ నటి సుబ్బలక్ష్మి కన్నుమూత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress R Subbalakshmi Passed Away: సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దక్షిణాది సీనియర్ నటి సుబ్బలక్ష్మి కన్నుమూశారు. ఆమె వయసు 87 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్బలక్ష్మి.. కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె మనవరాలు సౌభాగ్య సోషల్ మీడియా ద్వారా తెలిపారు. సుబ్బలక్ష్మి మృతితో సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది. పలువురు సినీ ప్రముఖులు ఆమె మృతికి నివాళులర్పించారు.
తెలుగు, తమిళ, మాలయాళ భాషల్లో మొత్తం 70కు పైగా సినిమాలలో సుబ్బలక్ష్మి నటించారు. మలయాళ చిత్ర సీమలో చేసిన అమ్మమ్మ పాత్రలు ఆమెకు మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. తెలుగులో కళ్యాణ రాముడు, ఏ మాయ చేసావె సినిమాలో కనిపించారు. ఏ మాయ చేసావెలో సమంతకు అమ్మమ్మగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చివరిసారి విజయ్ బీస్ట్ సినిమాలో సుబ్బలక్ష్మి కనిపించారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా ఆమె ఎన్నో సీరియల్స్‌లో నటించి ఆకట్టుకున్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
- Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
- CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
Also Read: Animal Movie Review: ‘యానిమల్’ మూవీ రివ్యూ!
సినీ పరిశ్రమలోకి రాకముందు జవహర్ బాలభవన్‌లో సంగీత, నాట్య శిక్షకురాలిగా సుబ్బలక్ష్మి పని చేశారు. 1951లో ఆల్ ఇండియా రేడియోలో కూడా ఉద్యోగం చేశారు. దక్షిణ భారతదేశం నుంచి ఆల్ ఇండియా రేడియోలో పని చేసిన తొలి లేడీ కంపోజర్‌గా సుబ్బలక్ష్మి రికార్డు సృష్టించారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
-
Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
-
Kala Chana Pulao Recipe: 4 స్టెప్స్‌లో కాలా చనా పులావ్.. టేస్ట్‌తో పాటు ప్రోటీన్ డబుల్.!
-
CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!