Site icon NTV Telugu

Shubman Gill: ‘నన్ను నమ్ము’.. సిరాజ్ కు గిల్ సూచన.. ఆ ప్లాన్ అమలు చేసిన వెంటనే..?

Shubman Gill

Shubman Gill

Shubman Gill: ఇంగ్లాండ్‌లో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్‌గా తన రెండో మ్యాచ్‌ ఆడుతున్న శుభ్‌మ‌న్ గిల్ తన అనుభవంతో కాకుండా.. తన అర్థవంతమైన నిర్ణయాలతో సీనియర్లను కూడా ఆశ్చర్యపరుస్తున్నాడు. బర్మింగ్‌హామ్ టెస్టులో జరిగిన ఓ ఆసక్తికర ఘటన ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. భారత బౌలింగ్‌ కు నాయకత్వం వహిస్తున్న మొహమ్మద్ సిరాజ్ తో ఫీల్డింగ్ సెట్టింగ్ పై గిల్ తీవ్ర చర్చ జరిపాడు.

Read Also:Medical shops: రెచ్చిపోతున్న మెడికల్ మాఫియా.. వయాగ్రా ట్యాబ్లెట్స్, అబార్షన్ కిట్ల అమ్మకాలు జోరు

ఈ సంభాషణలో మొదట మొహమ్మద్ సిరాజ్ ఫీల్డర్లు ఎక్కడ ఉంచాలో కెప్టెన్ గిల్ కు సూచిస్తున్నాడు. అయితే సిరాజ్ చెప్పిన మాటలు అన్ని విన్న తర్వాత “ఇక్కడ నువ్వు నార్మల్ లెంగ్త్ పక్కన వేస్తే ఔట్ అయ్యే అవకాశం ఉంది. ఇదేం లీడ్స్ పిచ్ కాదు. ఇదే విధంగా గతంలో ఔట్ అయ్యాడు. మాన్ లే! నన్ను నమ్ము” అని గిల్ చెప్పినట్లు స్టంప్ మైక్ స్పష్టంగా రికార్డ్ అయ్యింది. కానీ సిరాజ్ మాత్రం తనదైన పద్ధతిలో ముందుకెళ్లాలని తొలుత అనుకున్నప్పటికీ, చివరికి కెప్టెన్ సూచనను పాటించాడు.

Read Also:Kohli-Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అభిమానులకు షాక్!

దానితో తన తర్వాతి ఓవర్‌ లో సిరాజ్ ఔట్‌స్వింగర్ వేసి, ఆఫ్‌ స్టంప్ వెలుపల బంతిని వేసాడు. అంతే జాక్ క్రాలీ ఆ బంతిని ఆడగా.. అది నేరుగా పాయింట్ వద్ద ఉన్న సాయి సుదర్శన్ చేతుల్లోకి వెళ్లింది. ఇంకేముంది క్యాచ్ అవుట్. దీనితో బౌలర్ అండ్ కెప్టెన్ ఇద్దరితో పాటు టీం సభ్యులందరు సెలబ్రేషన్ చేసుకున్నారు. ఈ వికెట్‌తో సిరాజ్ ఇంగ్లాండ్‌ను మొదటి షాక్‌కు గురి చేయగా, వెంటనే ఆకాశ్ దీప్ మరో రెండు కీలక వికెట్లు తీసి స్కోరు బోర్డును కుదించేశాడు. నాల్గవ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 72 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది.

ఇక ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ తమ తొలి టెస్ట్ విజయం కోసం కేవలం 7 వికెట్ల దూరంలో ఉంది. కానీ, అందిన సమాచారం మేరకు నేడు చివరిరోజున వరణుడు మ్యాచ్ కి అడ్డంకి కలిగించే సూచనలు ఎక్కువుగా ఉన్నాయి.

Exit mobile version