చిత్తూరు జిల్లా కుప్పంలో మా ఊరికి బస్సు సౌకర్యం కల్పించండి జగన్ మామయ్య అంటూ విద్యార్థులు అభ్యర్థిస్తున్నారు. రోజు పాఠశాలకు 6 కిలోమీటర్లు నడిచి వెళ్తున్నాం మా సమస్య పట్టించుకోండి అని విద్యార్థుల విన్నవిస్తున్నారు. అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణపురం, చిగలపల్లి,పెద్దన కొట్టాలు మరియు తదితర ప్రాంతాలకు బస్సులను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. అయితే.. సుమారు 150 నుండి 200 మంది విద్యార్థులు పాఠశాలలకు,కళాశాలలకు వెళ్తున్నామని విద్యార్థులు వివరిస్తున్నారు.
Also Read : Diwali Special: దీపావళి ఎలా వచ్చింది..? ఏమిటా కథ..?
అయితే.. మునిసిపల్ ఎన్నికల వరకు బస్సు సౌకర్యం ఉండేదని, ఎన్నికల తరువాత బస్సును ఆపేశారని కూడా విద్యార్థులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. నేడు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని సీఎం జగన్ ప్రజలందరికీ దీపావళి శుభకాంక్షలు తెలిపారు. ‘దీపావళి అంటే దీపాల వరస… దుష్ట రాక్షస శిక్షణ చేసే దైవ శక్తి, దుర్మార్గం మీద ఉగ్రతాండవం చేసే స్త్రీ శక్తి, మోగించిన విజయ దుందుభికి ప్రతీక…మనం నేడు వెలిగించే… ఆ దీపాల వరస! చీకట్లను చీల్చే వెలుగుల పండగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు!’ అని ట్విట్టర్ వేదిక పోస్ట్ చేశారు సీఎం జగన్.