Site icon NTV Telugu

Tirupati: హై వోల్టేజ్ రైల్వే విద్యుత్‌ వైర్లు తగిలి విద్యార్థి మృతి

Dead Body Parcel West Godavari

Dead Body Parcel West Godavari

రైల్వే ట్రాక్ పట్టాలు దాటొద్దని, ఫ్లాట్ ఫాంలపై నిర్లక్ష్యంగా ఉండొద్దని రైల్వే అధికారుల సూచిస్తున్నప్పటికీ కొందరు అవేమీ పట్టించుకోకుండా ప్రమాదాలబారిన పడుతున్నారు. తాజాగా తిరుపతిలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మామండూరు దగ్గర హై వోల్టేజ్ రైల్వే విద్యుత్‌ వైర్లు తగిలి విద్యార్థి మృతి చెందాడు. రైలు దిగి ఫ్లాట్ ఫార్మ్ కు వెళ్లే సమయంలో ఘటన చోటుచేసుకుంది. ఫ్లాట్ ఫార్మ్ పై నుంచి కాకుండా రైలు పైకి ఎక్కడంతో విద్యార్థి ప్రమాదానికి గురయ్యాడు.

Also Read:Shamli Delhi Train: రైలు ప్రమాదానికి కుట్ర… ట్రాక్‌పై ఇనుప, సిమెంట్ పైపులు..

రైల్వే అధికారులు ఆ విద్యార్థిని హుటాహుటిన తిరుపతి రుయాకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. మృతి చెందిన విద్యార్థి డైరీ టెక్నాలజీ చదువుతున్న జాకేష్ గా గుర్తించారు. విద్యార్థి రైలు పైకి ఎందుకు ఎక్కాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Exit mobile version