Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Food Stop Eating 3 Hours Before Sleep Study Shows Benefits For Blood Pressure And Blood Sugar

Stop Eating 3 Hours Before Sleep: పడుకునే 3 గంటల ముందే భోజనం ముగిస్తే ఏం జరుగుతుంది..? స్టడీలో వెలుగులోకి కీలక అంశాలు..

Published Date :March 9, 2026 , 9:40 pm
By Sudhakar Ravula
Stop Eating 3 Hours Before Sleep: పడుకునే 3 గంటల ముందే భోజనం ముగిస్తే ఏం జరుగుతుంది..? స్టడీలో వెలుగులోకి కీలక అంశాలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Stop Eating 3 Hours Before Sleep: ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు.. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంటుంది.. లైఫ్‌ స్టైల్‌లో చేసుకునే చిన్నపాటి మార్పులే.. ఎన్నో మంచి ఫలితాలు వస్తాయి.. ఇక, పడుకునే సమయానికి కనీసం మూడు గంటల ముందు భోజనం ముగించడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇలా చేయడం వల్ల రక్తపోటు మరియు రక్తంలో షుగర్‌ లెవల్స్ మెరుగుపడే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. World Health Organization (WHO) ప్రకారం, 2024 నాటికి ప్రపంచంలో 30 నుంచి 79 సంవత్సరాల మధ్య వయస్సు గల సుమారు 1.4 బిలియన్ మందికి అధిక రక్తపోటు ఉంది. అలాగే 2022లో 830 మిలియన్ మంది మధుమేహంతో జీవిస్తున్నారని తెలిపింది.

పరిశోధన ఏమి చెబుతోంది?
అమెరికాలోని Northwestern University పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, నిద్రకు కనీసం మూడు గంటల ముందు తినడం మానేయడం శరీర ఆరోగ్యానికి మంచిదని తేలింది. ఈ పరిశోధన ఫలితాలు Arteriosclerosis, Thrombosis, and Vascular Biology జర్నల్‌లో ప్రచురించబడ్డాయి. మన శరీరం సిర్కాడియన్ రిథమ్ (Circadian Rhythm) అనే అంతర్గత గడియారాన్ని అనుసరిస్తుంది. ఇది నిద్ర, జీవక్రియ, హార్మోన్ విడుదల, గుండె పనితీరు వంటి అనేక శరీర ప్రక్రియలను నియంత్రిస్తుంది. అయితే రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల ఈ సహజ లయకు అంతరాయం కలిగి, రక్తపోటు పెరగడం మరియు రక్తంలో చక్కెర నియంత్రణలో సమస్యలు రావచ్చు.

Also Read

  • Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
  • Mamata Banerjee: మోడీ ‘ఝల్‌మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
  • Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
  • Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు

అధ్యయనం ఎలా నిర్వహించారు?
ఈ అధ్యయనంలో 36 నుంచి 75 సంవత్సరాల మధ్య వయస్సు గల 39 మంది అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న వ్యక్తులు పాల్గొన్నారు. వీరిని రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపు 13 నుంచి 16 గంటల వరకు ఉపవాసం పాటించింది.. మరో గ్రూపు 11 నుంచి 13 గంటల ఉపవాసం పాటించింది.. ఇద్దరూ పడుకునే సమయానికి మూడు గంటల ముందు తినడం ఆపడం మరియు రాత్రి సమయంలో లైట్లు మసకబార్చడం వంటి అలవాట్లను పాటించారు.

అధ్యయనం ఫలితాలు
పరిశోధనలో కొన్ని ఆసక్తికర ఫలితాలు బయటపడ్డాయి. రాత్రిపూట రక్తపోటు సుమారు 3.5 శాతం తగ్గింది.. హార్ట్‌బీట్ రేటు సుమారు 5 శాతం తగ్గింది.. రక్తంలో షుగర్‌ నియంత్రణ మెరుగుపడింది.. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగింది.. ఇవి గుండెపై ఒత్తిడిని తగ్గించి, భవిష్యత్తులో హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు తెలిపారు.

అమలు చేయడానికి సులభమైన మార్గాలు
1. భోజనం సమయాన్ని ముందుగానే నిర్ణయించండి.. మీరు రాత్రి 10 గంటలకు పడుకుంటే, రాత్రి 7 గంటలలోపే డిన్నర్ ముగించడానికి ప్రయత్నించండి.
2. తేలికపాటి భోజనం చేయండి.. ప్రోటీన్, కూరగాయలు, పప్పు, పన్నీర్ లేదా సలాడ్ వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవాలి.
3. నిద్రకు ముందు విశ్రాంతి అలవాటు చేసుకోండి.. లైట్లు తగ్గించడం, మొబైల్ లేదా స్క్రీన్‌ల వినియోగాన్ని తగ్గించడం మంచిది. అవసరమైతే హెర్బల్ టీ లేదా గోరువెచ్చని నీరు తాగవచ్చు.

అధ్యయన పరిమితులు
ఈ పరిశోధనలో కేవలం 39 మంది మాత్రమే పాల్గొన్నారు మరియు ఇది సుమారు 7.5 వారాలపాటు మాత్రమే జరిగింది. అందువల్ల మరింత పెద్ద స్థాయిలో పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అలాగే ఈ విధానం షిఫ్ట్ ఉద్యోగులు లేదా ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అందరికీ సరిపోకపోవచ్చు. అయితే నిద్రకు మూడు గంటల ముందు భోజనం ముగించడం వంటి చిన్న మార్పులు కూడా గుండె ఆరోగ్యం, జీవక్రియ మరియు నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • blood pressure study
  • blood sugar control tips.
  • circadian rhythm health
  • dinner before bedtime health benefits
  • eat before sleep study

తాజావార్తలు

  • Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు

  • Mamata Banerjee: మోడీ ‘ఝల్‌మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్

  • Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!

  • Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు

  • Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions