NTV Telugu Site icon

Stock Market: ఐదు రోజుల తర్వాత లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు

Stock

Stock

ఐదు రోజుల వరుస నష్టాల తర్వాత శుక్రవారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 525 పాయింట్ల లాభంతో 74,410 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 130 పాయింట్లు లాభపడి 22,619 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.23 దగ్గర ప్రారంభమైంది.

సెన్సెక్స్‌ సూచీలో ఇన్ఫోసిస్‌, మారుతీ మినహా మిగిలిన షేర్లన్నీ లాభాల్లో ఉన్నాయి. ఎం అండ్‌ ఎం, ఎల్‌ అండ్‌ టీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్‌, ఇండస్ఇండ్ బ్యాంక్‌, సన్‌ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐటీసీ, పవర్‌గ్రిడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల జాబితాలో ఉన్నాయి.

గత శుక్రవారం నుంచి స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాల కారణంగా భారతీయ సూచీలపై ప్రభావం చూపించాయి. మొత్తానికి వారం తర్వాత లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మారుతీ తప్ప ప్రస్తుతం అన్ని సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందు ఈ సూచీలు సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి.