NTV Telugu Site icon

Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Sneex

Sneex

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం ప్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు.. అనంతరం సూచీలు పుంజుకుంటూ లాభాల్లో కొనసాగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా ఎనిమిదోసారి పాలసీ రేటును యథాతథంగా ఉంచాలని నిర్ణయించిన తర్వాత భారతీయ షేర్ మార్కెట్ భారీ లాభాలను నమోదు చేసింది. ఇక సెన్సెక్స్ తాజాగా ఆల్-టైమ్ హై లెవల్ కొనసాగింది. సెన్సెక్స్ 1,618 పాయింట్లు లాభపడి 76, 693 దగ్గర ముగియగా.. నిఫ్టీ 468 పాయింట్లు లాభపడి 23, 290 దగ్గర ముగిసింది. అన్ని రంగాల సూచీలు లాభాలు కొనసాగాయి.

ఇది కూడా చదవండి: EVM: ‘‘ వాటికి ఇప్పుడు విశ్రాంతినివ్వండి.. వచ్చే ఎన్నికల్లో తిట్టండి’’..ఈవీఎంలను నిందించడంపై సీఈసీ సెటైర్లు..

బీఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ దాదాపు 1 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ దాదాపు 2 శాతం పెరిగాయి. నిఫ్టీలో విప్రో, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, LTIMindtree టాప్ గెయినర్స్‌గా సాగాయి. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా కన్స్యూమర్, బజాజ్ ఆటో, బ్రిటానియా నష్టపోయాయి.

ఇది కూడా చదవండి: Kaleswaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్దరణ పై ఫోకస్ పెట్టిన‌ ప్రభుత్వం..