NTV Telugu Site icon

Stock Market: మళ్లీ నష్టాల్లోకి సూచీలు.. దెబ్బతిన్న ఐటీ

Sneex

Sneex

ఆదివారం కేంద్రంలో మోడీ 3.0 ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో స్టాక్ మార్కెట్లకు మంచి ఊపు ఉంటుందని అంతా భావించారు. కానీ భారీ నష్టాలను చవిచూసింది. సోమవారం స్టాక్ మార్కెట్ ప్రారంభ దశలో లాభాల్లోనే ప్రారంభమైంది. సెన్సెక్స్ ఒకానొక దశలో77 వేల పాయింట్ల మార్క్ దాటి జీవితకాల గరిష్టాలను నమోదు చేసింది. నిఫ్టీ కూడా అలానే ట్రేడ్ అయింది. కానీ అంతలోనే ఒడుడొడుకులను ఎదుర్కొంది. చివరి దాకా అస్థిరంగానే సూచీలు కొనసాగాయి. సెన్సెక్స్ 203 పాయింట్లు నష్టపోయి.. 76, 490 దగ్గర ముగియగా.. నిఫ్టీ 30 పాయింట్లు నష్టపోయి 23, 259 దగ్గర ముగిసింది. ఇక ఐటీ రంగం బాగా దెబ్బతింది. ఇక రూపాయి మారకం విలువు డాలర్‌కు 13 పైసలు తగ్గి 83.51 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Nandamuri Balakrishna: లేపాక్షిలో ఉత్సవాలను మళ్లీ ప్రారంభిస్తాం.. అభివృద్ధి చేసి చూపిస్తాం..