ఆసీస్ స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ తెలుగు సినిమాల్లోని డైలాగులు చెప్పి అభిమానులను అలరించాడు. లండన్ వేదికగా భారత్‌తో జరగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో బీజీగా ఉన్న స్మిత్.. ఖాళీ సమయంలో స్టార్‌స్పోర్ట్స్-1 తెలుగు యాంకర్ తో కాసేపు మాట్లాడాడు. ఈ క్రమంలో యాంకర్ చెప్పిన డైలాగ్‌లను స్మిత్ తనదైన స్టైల్‌లో చెప్పి నవ్వులు తెప్పించాడు.
Read Also : Harassing: వెంటబడి వేధించాడు.. చెప్పుతో కొట్టిన యువతి
మన టాలీవుడ్ లెజెండ్ హీరో నందమూరి నట సింహం బాలకృష్ణ డైలాగ్‌లను స్టీవ్ స్మిత్ తనదైన మేనరిజంతో చెప్పుకొచ్చాడు. అపాయింట్‌మెంట్ లేకుండా వస్తే వకేషన్ చూడను, లొకేషన్ చూడను, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఇఫ్ యు ట్రబుల్ ది ట్రబుల్.. ట్రబుల్ ట్రబుల్స్ యు.. ఐయామ్ నాట్ ది ట్రబుల్, ఐయామ్ ట్రుత్ వంటి డైలాగ్‌లు స్మిత్ నోటి నుంచి వచ్చాయి.
Read Also : Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్యేకు పాలాభిషేకం చేసి పల్లకిలో ఊరేగింపు..
ఇక అదే విధంగా లాస్ట్ కు యాంకర్ తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ పుష్ప డైలాగ్ ను చెప్పడంతో దాన్ని తన స్టైల్ లో స్టీవ్ స్మిత్ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను స్టార్‌స్పోర్ట్స్-1 ట్విటర్ అకౌంట్ లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. క్రీజులో మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్ ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా మొత్తంగా 296 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది.
స్టీవ్ స్మిత్ నోట 🥳
మన తెలుగు సినిమా డైలాగ్స్ 😎మరి తనదైన మనేరిజంతో 🔥
ఎలా అలరించాడో మీరే చూసేయండి 😉చూడండి 👀 #WTCFinalOnStar | #AUSvsIND Day 3 Live
మీ 📺 #StarSportsTelugu/HD & Disney+Hotstar లో #BelieveInBlue pic.twitter.com/maudxIGLoJ— StarSportsTelugu (@StarSportsTel) June 9, 2023
