Steve Jobs: అది అక్టోబర్ 5, 2011న.. ఆ రోజు ప్రపంచం ఒక సృష్టికర్తను, గొప్ప ఆవిష్కర్తను కోల్పోయింది. ఆయనే స్టీవ్ జాబ్స్. టెక్నాలజీని మార్చిన వ్యక్తిగా ప్రపంచ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను సువర్ణ అక్షరాలతో లిఖించుకున్న గొప్ప ఆవిష్కర్త. నిత్యం కొత్త ఉత్పత్తుల ద్వారా ప్రజల జీవితాల దిశను మార్చిన సృష్టికర్త ఆయన. కానీ ఆయన తన జీవిత పోరాటంలో క్యాన్సర్ చేతిలో ఓడిపోయి ఆటను ముగించి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. మీకు తెలుసా ఆయన తన చివరి రోజుల్లో క్యాన్సర్‌తో పోరాడుతూ.. తనకు తానే ఒక లేఖను రాసుకున్నాడని.. ఇంతకీ ఆ లేఖలో ఏం ఉందో తెలుసా..
READ ALSO: West Bengal : వెస్ట్ బెంగాల్‌లో షాకింగ్ ఘటన – బాలికపై గ్యాంగ్ రేప్
అది సెప్టెంబర్ 2, 2010..
తన మరణానికి ముందు రోజుల్లో జాబ్స్ తనలోకి తాను చూసుకునేవాడు. అది సెప్టెంబర్ 2, 2010. ఆయన తన ఐప్యాడ్‌లో ఒక ఇమెయిల్ రాశాడు. అది మరేవరికో కాదు.. తనకే రాసుకున్నాడు. ఆయన ఆ ఇమెయిల్ తనకు పంపుకున్నాడు. ఇది ఏదో కొత్త వ్యాపార ప్రణాళిక కాదు.. ఏ ఉత్పత్తికి సంబంధించిన ఆలోచన కూడా కాదు. ఇది ఆయన వ్యక్తిగత ఆలోచనలకు అద్దం పట్టే మెయిల్. దీనిలో ఆయన జీవితాన్ని రాసుకున్నారు.
ఈ ఇమెయిల్‌ను చాలా ఏళ్ల వరకు ఎవరూ చూడలేదు. కానీ తరువాత లారెన్ పావెల్ జాబ్స్, టిమ్ కుక్, జానీ ఐవ్ సహాయంతో ప్రారంభించిన స్టీవ్ జాబ్స్ ఆర్కైవ్ ద్వారా ఇది బయటి ప్రపంచానికి తెలిసింది. ఈ ఇమెయిల్‌లో జాబ్స్ ఇలా రాశాడు..
“నేను నా సొంత ఆహారంలో చాలా తక్కువ పండిస్తాను, నేను పెంచే కొద్దిపాటి ఆహారాన్ని నేను నాటను లేదా మెరుగుపరచను. నేను నా సొంత బట్టలు తయారు చేసుకోను. నేను కనిపెట్టని లేదా మెరుగుపరచని భాషను మాట్లాడతాను. నేను కనుగొనని గణితాన్ని ఉపయోగిస్తాను. నేను సృష్టించని, అమలు చేయని లేదా తీర్పు ఇవ్వని స్వేచ్ఛలు, చట్టాల ద్వారా నేను రక్షించబడ్డాను. నేను సృష్టించని సంగీతం ద్వారా నేను కదిలించబడ్డాను. నాకు వైద్య సహాయం అవసరమైనప్పుడు, నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి నేను పూర్తిగా నిస్సహాయంగా ఉన్నాను. నేను ట్రాన్సిస్టర్, మైక్రోప్రాసెసర్, ఆబ్జెక్ట్-ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లేదా నా పని ఆధారపడిన సాంకేతికతలను కనిపెట్టలేదు. నేను నా జాతిని, జీవించి ఉన్న లేదా చనిపోయిన వాటిని, గాఢంగా ప్రేమిస్తున్నాను, గౌరవిస్తాను. నా జీవితం, శ్రేయస్సు కోసం వాటిపై పూర్తిగా ఆధారపడి ఉన్నాను” అని ఆయన తనకు తాను పంపుకున్న లేఖలో రాసుకున్నారు.
టెక్నాలజీ రారాజు తన చివరి క్షణాల్లో.. తన ప్రతి విజయం, ప్రతి శ్వాస వేరొకరి కృషి, సహకారంపై ఆధారపడి ఉంటుందని నమ్మాడు. జీవితంలో మనం తరచుగా మన విజయాలను మన కృషి ఫలితంగా భావిస్తాము.. కానీ స్టీవ్ జాబ్స్.. ప్రతి విజయం వెనుక సమాజం, సైన్స్, సంస్కృతి, మానవత్వం సహకారం ఉంది చెప్పాడు.
READ ALSO: Luckiest Zodiac Signs: ఈ ఐదు రాశుల వాళ్లకు తిరుగు లేదు.. అదృష్టం అంటే వీళ్లదే..
