టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ పేరుతో స్టార్ హీరోలు నటించిన సూపర్ హిట్ సినిమాలను మరోసారి థియేటర్స్ లో రిలీజ్ చేస్తూ వస్తున్నారు. టాలీవుడ్ లో ఈట్రెండ్ ఓ రేంజ్ లో జరిగింది. మురారి, సింహాద్రి, పోకిరి, చెన్నకేశవరెడ్డి, సూర్య సన్నాఫ్ కృష్ణన్ వంటి సినిమాలు భారీ వసూళ్లు రాబట్టి సూపర్ హిట్ గా కూడా నిలిచాయి. కానీ ఇదంతా ఒకప్పుడు. ఒకరిని చూసి ఒకరు రీరిలీజ్ ట్రెండ్ కానీ క్యాష్ చేసుకుందామనుకున్నారు. అక్కడే తేడా వచ్చింది.
Also Read : Ravi Teja : మాస్ జాతర.. సెప్టెంబర్ లో కూడా లేదు… రిలీజ్ ఎప్పుడంటే
ఇప్పుడు లేటెస్ట్ గా మెగాస్టార్ చిరు బర్త్ డే కానుకగా స్టాలిన్ ను వరల్డ్ వైడ్ గా రీరిలీజ్ చేసారు. కానీ ఈ సినిమా మినిమం వసూళ్లు కూడా రాబట్టలేదు. ఓవర్సీస్ లోను ఈ ఈసినిమా చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టలేదు. విజయవాడ వంటి మెయిన్ స్టేషన్స్ లోను ఆశించిన నెంబర్ కనిపించేలేదు. రీరిలీజ్ లో ప్లాప్ అయిన సినిమాల లిస్ట్ లో స్టాలిన్ వచ్చి చేరింది. టాలివుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ ముగిసింది అనే చెప్పొచ్చు. మొన్నామధ్య వచ్చిన స్టార్ హీరో సినిమా కూడా చెప్పుకోతగ్గ కలెక్షన్స్ ఏమి రాబట్టలేదు. స్టార్ హీరోల బర్త్ డే రోజు రిలీజ్ చేస్తున్న సినిమాలు కూడా కలెక్షన్స్ రాబట్టడం లేదంటే రీరిలీజ్ ట్రెండ్ ను ఇక ఆపేయడం బెటరనే టాక్ వినిపిస్తోంది. స్టాలిన్ రీరిలీజ్ ను ఫ్యాన్స్ కూడా అంతగా పట్టించుకోలేదనేది వాస్తవం. అటు మేకర్స్ కూడా రీరిలీజ్ ట్రెండ్ ను క్యాష్ చేసుకుందామని ప్లాప్ సినిమాలను కూడా రీరిలీజ్ చేయడం వలన మంచి సినిమాలు కూడా కలెక్షన్స్ రాబట్టడడం లేదు.
