Rajya Sabha Polls : ఇవాళ దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి రాజ్యసభ ఎంపీల ఎంపికకు (ఫిబ్రవరి 27న) పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. నేటి సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 12 రాష్ట్రాల నుంచి 41 సీట్లు ఖాళీ కావడంతో అంతే సంఖ్యలో అభ్యర్థులు తమ నామినేషన్లను సమర్పించారు. అలాంటి పరిస్థితుల్లో 12 రాష్ట్రాల నుంచి 41 మంది అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. దీంతో మిగిలిన మూడు రాష్ట్రాలకు రాజ్యసభ ఎన్నికలు నేడు జరుగనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 10, కర్ణాటకలో నాలుగు, హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక స్థానానికి పోలింగ్ జరగబోతుంది. ఈ 15 రాజ్యసభ స్థానాల్లో హోరాహోరీగా పోటీ కొనసాగుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని 10 రాజ్యసభ స్థానాలకు కాసేపట్లో ఓటింగ్ జరగనుంది. మొత్తం 11 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. వీరిలో భారతీయ జనతా పార్టీకి చెందిన 8 మంది, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ముగ్గురు ఉండగా.. 403 మంది సభ్యులున్న యూపీ అసెంబ్లీలో కేవలం 397 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు వేసేందుకు అర్హత సాధించారు.
Read Also: Saipallavi : మొదటిసారి ఆ హీరోతో రొమాన్స్ చేయబోతున్న సాయి పల్లవి?
ఇక, ఏకగ్రీవం అయిన 41 మంది రాజ్యసభ ఎంపీల్లో సోనియా గాంధీ, జేపీ నడ్డాతో పాటు ఇటీవలె కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ఎల్ మురుగన్ ఏకగ్రీవం అయ్యారు. ఇక, ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి అత్యధికంగా 20 మంది సభ్యులు ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరుగురు, టీఎంసీ నుంచి నుంచి నలుగురు, వైసీపీ నుంచి ముగ్గురు, ఆర్జేడీ నుంచి ఇద్దరు, బీజేడీ నుంచి ఇద్దరు, ఎన్సీపీ, శివసేన, బీఆర్ఎస్, జేడీయూ పార్టీల నుంచి ఒక్కో అభ్యర్థి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక మిగిలిన 15 స్థానాలకు కాసేపట్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ 15 స్థానాలు ఉత్తర్‌ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది.
