నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా మరో తీపి కబురు చెప్పింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న మల్టీ టాస్కింగ్ స్టాప్ (నాన్ టెక్నికల్), హవల్దార్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది..గతంలో విడుదల చేసిన ఉద్యోగాల కన్నా కూడా ఈసారి భారీగా ఉద్యోగాలను విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ వివరాలను ఒకసారి చూద్దాం..
పోస్టుల సంఖ్య :
MTS : 1198
హవల్దార్ :– 360
వయోపరిమితి : 18 నుంచి 25 సంవత్సరాల మధ్య, 18 నుంచి 27 సంవత్సరాల మధ్య (హవల్దార్ సిబిఐసి) ఆగస్టు – 01 – 2023 నాటికి ఉండాలి..
విద్యా అర్హతలు : పదవ తరగతి లేదా మెట్రిక్యులేషన్ లేదా సమాన పరీక్ష పాసై ఉండాలి.
దరఖాస్తు ఫీజు: 100/- రూపాయలు (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్, ఎక్స్ సర్వీస్మెన్ లకు ఫీజు లేదు)
పరీక్ష విధానము : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్..
దరఖాస్తు విధానము : ఆన్లైన్
దరఖాస్తు గడువు : జూలై 21 – 2023
దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ : జూలై 26 నుంచి 27వ తేదీ వరకు
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ తేదీ : సెప్టెంబర్ 2023లో..
SSC MTS టైర్ 1 పరీక్ష సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో జరిగే అవకాశం ఉంది. టైర్ -2 పరీక్ష షెడ్యూల్‌పై త్వరలో స్పష్టత రానుంది. SSC MTS, హవల్దార్ పరీక్షకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభ్యర్థులు అధికారిక పోర్టల్‌ను తరచూ చెక్ చేస్తుండాలి. ఈ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్‌లో జరగనున్నాయి. జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ అండ్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అనే నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు ఉండనున్నాయి..
ఇకపోతే ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్ హవల్దార్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పదో తరగతి పాసై ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయస్సు పరిమితి ఉంది.. ఆసక్తి అర్హత కలిగిన వారంతా కూడా నోటిఫికేషన్ ను అధికార పోర్టల్ ను అప్లై చేసుకోగలరు..
