Site icon NTV Telugu

SSC Exam Fee : విద్యార్థులకు శుభవార్త.. పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు

Ssc

Ssc

పదో తరగతి విద్యార్థులకు శుభవార్త చెప్పింది విద్యాశాఖ. వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు ఫీజులు చెల్లించేందుకు ఇప్పటికే షెడ్యూల్‌ను విడుదల చేసింది విద్యాశాఖ. అయితే.. ఆ షెడ్యూల్‌ ప్రకారం నేటితో గడువు ముగియనుంది. ఈ క్రమంలో పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు తేదీని సవరిస్తూ విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 2023, SSC/OSSC/వొకేషనల్ పబ్లిక్ పరీక్షలకు హాజరు కావాలనుకునే రెగ్యులర్ మరియు ప్రైవేట్ ఒకసారి ఫెయిల్ అయిన అభ్యర్థులు, నవంబర్ 24 వరకు సంబంధిత హెడ్‌మాస్టర్‌కు ఆలస్య రుసుము లేకుండా పరీక్ష రుసుమును చెల్లించవచ్చని పేర్కొంది.

Also Read : IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం.. జట్టు నుంచి కెప్టెన్ కేన్ విలియమ్సన్ అవుట్
రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 5, రూ.200 ఆలస్య రుసుముతో 15 వరకు విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించేందుకు అవకాశం కల్పించింది. పరీక్ష రుసుము కూడా రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 29 వరకు అంగీకరించబడుతుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు సంబంధిత ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించవచ్చు లేదా https://www.bse.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Exit mobile version