SS RajaMouli About Kalki 2898 AD : పాన్ ఇండియ స్టార్ ప్రభాస్ నటించిన అత్యంత అంచనాల చిత్రం “కల్కి 2898 AD” జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు కల్కి సినిమా పై అంచనాలను అమాంతం తారా స్థాయికి పెంచేశాయి.
BMW 5 Series Long Wheelbase: బీఎండబ్ల్యూ నుంచి ఆ సిరీస్ కారు బుకింగ్స్ ప్రారంభం..
ఈ సినిమా రెండో ట్రైలర్ ను కూడా తాజాగా విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ ట్రైలర్ లో వావ్.. అనిపించేలా ఉండడంతో అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. ఈ సినిమాని సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు సినీ అభిమానులు తెగ ఆత్రంగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు, జక్కనగా పిలుచుకునే ఎస్ఎస్ రాజమౌళి కూడా ఈ రిలీజ్ ట్రైలర్ చూసి ఇంప్రెస్ అయ్యాడు. ట్రైలర్ చూసి స్టన్ అయ్యా అంటూ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Kalki 2898 AD : యూఎస్ మార్కెట్ లో సెన్సేషన్ సెట్ చేస్తున్న ప్రభాస్..
రాజమౌళి తాజాగా ట్వీట్ చేస్తూ.., “ఇది పవర్ ఫుల్ ట్రైలర్. ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే..” అంటూ ఆయన ట్వీట్ చేసాడు. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ పాత్రలు ఈ చిత్రానికి స్ట్రాంగ్ పాయింట్ గా నిలుస్తాయని అన్నారు. ప్రస్తుతం కల్కి సినిమాపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Power packed trailer it is… https://t.co/WunNn92TJF It sets the right mood and tone to watch the film FDFS.
Amitabh ji, Darling and Deepika’s characters seem to have a lot of depth and are truly intriguing. I am still stuck on Kamal sir’s look and how he amazes as always 🤯…
— rajamouli ss (@ssrajamouli) June 22, 2024