Site icon NTV Telugu

Puspa 2: ‘పుష్ప 2’ సెట్స్‌కి ప్రత్యేక అతిథి.. ఫోటోను పంచుకున్న మేకర్స్..

Puspa2

Puspa2

SS Rajamouli in Puspa 2 Movie sets: ప్రస్తుతం భారతీయ చిత్రసీమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి పుష్ప 2. అల్లు అర్జున్ హీరోగా., సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా చిత్రానికి సీక్వెల్ కోసం ఆసక్తిగా అల్లు అభిమానులు ఎదురుచూస్తున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేయాలని భావించారు. కానీ., పనులు పూర్తి చేయడంలో జాప్యం కారణంగా ఇప్పుడు ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న విడుదల చేయనున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం సెట్స్‌ దగ్గరికి ఒక ప్రత్యేక అతిథి వచ్చారు. అతని ఫోటోను మేకర్స్ షేర్ చేశారు. తెలుగు సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమా సెట్స్‌ కి వెళ్లారు.

2024 Dussehra Offer: రూ.100 కొట్టు మేకను పట్టు.. దసరాకు బంపర్ ఆఫర్! ఎక్కడో తెలుసా

ఈ ఫొటోను చిత్ర నిర్మాత మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాజమౌళితో కలిసి ఉన్న ఫోటోలో పుష్ప 2 దర్శకుడు సుకుమార్ కూడా ఉన్నాడు. సౌత్ ఇండియా అయినా, నార్త్ ఇండియా అయినా ఎక్కడ చూసినా ఈ సినిమాపై భారీ బజ్ ఉంది. 2021లో విడుదలైన ఈ సినిమా మొదటి భాగం హిందీలోనే రూ.200 కోట్ల బిజినెస్ చేసింది. అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే రెండో పార్ట్ లో ఫహద్ క్యారెక్టర్ కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చారని అంటున్నారు. కథ లీక్ కాకుండా ఉండేందుకు సుకుమార్ సినిమా క్లైమాక్స్‌ను గోప్యంగా ఉంచారు. సెట్‌లో మొబైల్ ఫోన్‌ల వాడకం కూడా నిషేధించబడింది. అంతే కాదు ఈ సినిమా స్క్రిప్ట్‌ను కూడా కొంతమంది ప్రత్యేక వ్యక్తులకు మాత్రమే చదవడానికి ఇచ్చారని సమాచారం.

Exit mobile version