Site icon NTV Telugu

Srushti Fertility Scam: నేరాన్ని అంగీకరించిన డాక్టర్‌ నమ్రత.. కన్ఫెషన్ రిపోర్ట్‌లో సెన్సేషన్ విషయాలు!

Srushti Fertility Scam

Srushti Fertility Scam

Dr. Namrata Confession Report Reveals in Srushti Fertility Scam: సికింద్రాబాద్‌ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితురాలు డాక్టర్‌ నమ్రత తన నేరాన్ని అంగీకరించారు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. నమ్రత కన్ఫెషన్ రిపోర్ట్‌లో సెన్సేషన్ విషయాలు నమోదు చేశారు. 1998లో మొదటిసారి విజయవాడలో ఫెర్టిలిటీ సెంటర్ స్థాపించానని, 2007లో సికింద్రాబాద్‌లో రెండో బ్రాంచ్ ఓపెన్ చేశానని తెలిపారు. ఆ తర్వాత విశాఖలోను మరో ఫర్టిలిటీ సెంటర్ ప్రారంభించానని, తనకు రెండవ కుమారుడు జయంతి కృష్ణ న్యాయవాదిగా ఉంటూ సహకరించేవాడని నేరాంగీకార పత్రంలో పేర్కొన్నారు.

‘సరోగసి పేరుతో ఒక్కో జంట నుంచి 20 నుండి 30 లక్షలు వరకు వసూలు చేశాము. ఏజెంట్ల ద్వారా పిల్లలను కొనుగోలు చేశాము. అబార్షన్ కోసం ఆస్పత్రికి వచ్చే గర్భిణీలను గుర్తించి వారికి డబ్బులు ఆశ చూపాము. ప్రసవం తర్వాత వారి పిల్లల్ని కొనుగోలు చేసాము. ఎంతో మంది పిల్లలు లేని దంపతులకు సరోగసి ద్వారా పుట్టిన పిల్లలుగా నమ్మించాం. మొదట మహారాణిపేట పోలీస్ స్టేషన్లో నా మీద కేసు నమోదు అయింది. ఆ తరువాత వైజాగ్ టూ టౌన్, గోపాలపురం పోలీస్ స్టేషన్లలో ఐదు కేసులు.. గుంటూరు కొత్తపేటలో మరో కేసు నమోదయింది. 2020లో మహారాణిపేటలో నమోదైన కేసులో రిమాండ్ వెళ్లి వచ్చాను. పిల్లల్ని కొనుగోలు చేయడంలో సంజయ్ తో పాటు సంతోషి కీలకంగా వ్యవహరించారు. సికింద్రాబాద్ సెంటర్లో సూపర్వైజర్ కం ఫార్మసిస్ట్ గా కృష్ణ, రిసెప్షనిస్ట్ గా పద్మ, టెలికార్స్ గా అర్చన మేరీ, సోనా, నర్సుగా సురేఖ, ల్యాబ్ టెక్నీషియన్ గా ప్రభాకర్ ఉన్నారు’ అని కన్ఫ్ఫెక్షన్ రిపోర్టులో నమ్రత వెల్లడించారు.

Also Read: Coolie vs War 2: రెండో రోజు సీన్ రివర్స్.. మండే నుంచి అసలు సిసలైన పరీక్ష!

‘వైజాగ్ సెంటర్లో మేనేజర్ గా కళ్యాణి, ల్యాబ్ టెక్నీషియన్ గా రమ్య ఉన్నారు. విజయవాడలో డాక్టర్ మధులత, డాక్టర్ కిషోర్ బాబు, డాక్టర్ కరుణ కీలకంగా ఉన్నారు. అనస్తీషియా డాక్టర్ గా గాంధీ ఆస్పత్రికి చెందిన సదానందం కీలకంగా ఉన్నారు. డబ్బు మొత్తాన్ని వివిధ బ్యాంకులకు బదిలీ చేశాను. సరోగసి కేస్ షీట్లు మొత్తాన్ని ఎవరు ముట్టుకోకుండా భద్రంగా దాచాను. నా కన్సల్టెన్సీ రూమ్లో ప్రత్యేక బాక్సులో భద్రపరిచాను. గోపాలపురంలో ఫిర్యాదు చేసిన రాజస్థాన్ దంపతుల కేసులో సరోగసి ద్వారా బిడ్డను ఇస్తానని నమ్మించాను. జూబ్లీహిల్స్ లోని ప్రముఖ ఆస్పత్రికి అబార్షన్ కోసం వచ్చిన దంపతులను మా ఏజెంట్లు డబ్బుకు ఒప్పించారు’ అని కన్ఫ్ఫెక్షన్ రిపోర్టులో నమ్రత తెలిపారు.

Exit mobile version