NTV Telugu Site icon

Tollywood Movies : ఆ బ్యానర్ నుంచి మూడు సినిమాలు హ్యాట్రిక్ కొట్టేనా ?

New Project 2024 11 03t100359.675

New Project 2024 11 03t100359.675

Tollywood Movies : ఇటీవల కాలంలో కొన్ని బ్యానర్లు వరుస పెట్టి సినిమాలు తీస్తున్నాయి. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా ఒకే సమయంలో రెండు మూడు చిత్రాలను లైన్లో పెడుతున్నాయి. అలాంటి బ్యానర్లలో ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఒకటి. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్లో ఇప్పటి వరకు సరైన్ హిట్ పడలేదు. కానీ వరుస పెట్టి సినిమాలు తీస్తూనే ఉంది. కొంతమంది నిర్మాతలకు ఇండస్ట్రీ మీద ఉన్న ఇష్టంతో నష్టమొచ్చినా సినిమాలు చేస్తూనే ఉంటున్నారు. ఇప్పటిదాకా ఈ బ్యానర్లో చేసిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు.

Read Also:IND vs NZ: న్యూజిలాండ్ ఆలౌట్.. టీమిండియా టార్గెట్ 147

వాస్తవానికి టాలీవుడ్‌లో ప్రొడక్షన్ కంపెనీలు తమ సినిమాను రిలీజ్ చేసేందుకు ఎంత కష్టపడతాయో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక నెలలో పలు సినిమాలు రిలీజ్ చేసి తమ సత్తా ఏమిటో చూపిస్తున్నారు ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ వారు. ఈ బ్యానర్ నుంచి ప్రస్తుతం ఏకంగా మూడు సినిమాలు చేస్తున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న ‘మట్కా’ చిత్రాన్ని నవంబర్ 14న గ్రాండ్ రిలీజ్‌కి రెడీ చేశారు. ఈ సినిమాను పీరియాడిక్ థ్రిల్లర్‌గా దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న ‘మెకానిక్ రాకీ’ చిత్రాన్ని నవంబర్ 22న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేశారు. ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి అంచనాల మధ్య విడుదల కానున్నాయి.

Read Also:Cyber ​​Fraud: సైబర్‌ మాయాజాలం.. ఉద్యోగం పేరుతో రూ.1 లక్ష 75 వేలు స్వాహా..

ఇక ఈ సినిమాలతో పాటు ‘వికటకవి’ అనే సినిమాను కూడా జీ5 ఓటీటీలో నవంబర్ 28న విడుదల చేయనున్నారు ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్. ఇలా ఒకే నెలలో మూడు సినిమాలతో సందడి చేయనున్న ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు నవంబర్‌లో సాలిడ్ హిట్స్ అందుకునేందుకు రెడీ అయ్యారు. ఈ దెబ్బతోనైనా ఎస్ ఆర్ టీ బ్యానర్ బ్యాట్ టైం పోయి గుడ్ టైం స్టార్ట్ అవుతుందేమో చూడాలి.

Show comments