శ్రియా రెడ్డి.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు.. గతంలో కొన్ని సినిమాల్లో కనిపించింది.. అయితే ఆ సినిమాలు అంతగా ఫేమ్ ను అందివ్వలేక పోయాయి.. గత ఏడాదిలో రిలీజ్ అయిన సలార్ మాత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో అమ్మడుకు క్రేజ్ తో పాటుగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా అదిరిపోయే లుక్ తో ఫోటోలను అభిమానులతో పంచుకుంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
తమిళ నటిగా కోలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది.. తెలుగులో కూడా వరుస సినిమాలను లైన్ లో పెడుతుంది.. ప్రభాస్ తో నటించిన సలార్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యింది.. ఇక ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకొనే ప్రయత్నం చేస్తుంది.. ఈ క్రమంలో అమ్మడు తన లేటెస్ట్ లుక్స్ తో నెట్టింట హంగామా చేస్తోంది. స్టన్నింగ్ గా మెరుస్తూ తన అభిమానులు, నెటిజన్లకు షాకిస్తోంది.. కస్సుమనే చూపులతో ఉన్న ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..
ఇక సినిమాల విషయానికొస్తే.. తమిళంలో సమురై, బ్లాక్, తిమిరు, కంచివరం వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చి అందరి మనసును దోచుకుంది.. ఇకపోతే పవన్ కళ్యాణ్ – సుజీత్ కాంబోలో వస్తున్న OG మూవీతో అలరించబోతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానుంది.. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్ట్లను ఒకే చేసిందని సమాచారం…