NTV Telugu Site icon

Srisailam Temple: జనవరి 1న శ్రీశైలంలో స్పర్శదర్శనాలు, ఆర్జిత అభిషేకాలు నిలిపివేత

Srisailam Temple

Srisailam Temple

Srisailam Temple: ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో జనవరి 1వ తేదీన శ్రీమల్లికార్జునస్వామి స్పర్శదర్శనాలు, ఆర్జిత అభిషేకాలను నిలిపివేశారు. జనవరి 1న నూతన సంవత్సరం సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా నిలుపుదల చేస్తున్నట్లు దేవస్థానం ప్రకటించింది. స్పర్శదర్శనాలు, ఆర్జిత అభిషేకాలతో పాటు ఉదయాస్తమాన, ప్రాతకాల, ప్రదోషకాల సేవలు కూడా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. నూతన సంవత్సరం సందర్భంగా మల్లన్న దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే స్పర్శదర్శనాలు, ఆర్జిత అభిషేకాలను నిలిపివేస్తున్నట్లు నిర్ణయాన్ని తీసుకున్నారు.

Read Also: Allu Arjun : పోలీసుల విచారణలో అల్లు అర్జున్ ఎమోషనల్..

Show comments