Srinu Vaitla: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌కు భారీ టోకరా: కోట్లలో ముంచేసిన కేటుగాళ్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న దర్శకుడు శ్రీను వైట్ల, రియల్ ఎస్టేట్ మోసానికి గురయ్యారు. వికారాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో వ్యవసాయ భూమి కొనుగోలు వ్యవహారంలో కొందరు వ్యక్తులు ఆయన్ని నమ్మించి నిలువునా ముంచేశారు. కొన్నేళ్ల క్రితం వికారాబాద్ జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు శ్రీను వైట్లను కలిశారు. తమకు చేవెళ్లలో వ్యవసాయ భూమి ఉందని, దాన్ని విక్రయిస్తున్నామని నమ్మబలికారు. వారు చూపించిన పత్రాలను నమ్మిన దర్శకుడు, ఆ భూమిని కొనుగోలు చేసేందుకు సుమారు రూ. 1 కోటి వరకు చెల్లించారు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయినట్లు సమాచారం.
Also Read Vaani Kapoor: టూ పీస్ అవుట్ ఫిట్‌లో రచ్చ.. సమ్మర్‌ను మరింత హీట్ ఎక్కిస్తోన్న వాణీ!
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
ఇటీవలి వరకు ఆ భూమి తనదేనని భావించిన శ్రీను వైట్లకు కోర్టు తీర్పుతో గట్టి షాక్ తగిలింది. ఆ స్థలం అసలు యజమానులు వేరే వ్యక్తులని, మోసగాళ్లు ఫోర్జరీ పత్రాలతో లేదా తప్పుడు సమాచారంతో ఆయన్ని నమ్మించారని తేలిపోయింది, ప్రస్తుతం ఆ భూమి మార్కెట్ విలువ సుమారు రూ. 7 కోట్ల వరకు ఉంటుందని అంచనా. తమను మోసం చేసి, వేరే వాళ్ల స్థలాన్ని తనకు అంటగట్టినట్లు గుర్తించిన శ్రీను వైట్ల వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ మోసంపై ఆయన హైదరాబాద్ సి.సి.ఎస్ (CCS) పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఇలాంటి మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో, ఎంతటి వారైనా సరే భూములు కొనేముందు పక్కాగా లీగల్ వెరిఫికేషన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!