Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా సరికొత్త సినిమా అనౌన్స్ అయింది. దసరా సినిమాతో ప్రేక్షకులందరినీ అలరించిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్ సినిమా ఇప్పుడు తెరకెక్కబోతోంది. ప్రస్తుతానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని తన రెండవ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా మూడో సినిమాకే శ్రీకాంత్ ఓదెల చిరంజీవి డైరెక్టు చేసే అవకాశం దక్కిం చేసుకున్నాడు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ సినిమాని నాని సమర్పించడం. నాని దసరా సినిమాని నిర్మించిన సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయడమే ధ్యేయంగా సినీ రంగ ప్రవేశం చేసిన శ్రీకాంత్ ఓదెల తన మూడవ సినిమాకే ఆయనని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకోవడం గమనార్హం.
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన దసరా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నానినీ మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసేందుకు ఈ సినిమా బాగా ఉపయోగపడింది. ఈ నేపథ్యంలోనే నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలోనే తన రెండవ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి శ్రీకాంత్ ఓదెల చెప్పిన కథ నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కొద్ది సేపటి క్రితం ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన నాని సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటించారు. తర్వాత సినిమా యూనిట్ నుంచి కూడా అధికారిక ప్రకటన వచ్చేసింది.