Site icon NTV Telugu

Sri Sri Ravi Shankar: భారత్‌కు గర్వకారణం.. శ్రీ శ్రీ రవిశంకర్‌కు వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు

Sri Sri Ravi Shankar Award

Sri Sri Ravi Shankar Award

Sri Sri Ravi Shankar: భారతదేశానికి గర్వకారణం అయిన క్షణం ఇది. దేశానికి చెందిన ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ను బోస్టన్ గ్లోబల్ ఫోరం AI వరల్డ్ సొసైటీ “వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు 2025″తో సత్కరించాయి. ఈ గౌరవం 2015 నుంచి 2025 మధ్య శాంతి, భద్రతా రంగానికి చేసిన విశేష కృషికి గుర్తింపుగా ప్రధానం చేసినట్లు కమిటీ పేర్కొంది. శ్రీశ్రీ రవిశంకర్ ప్రపంచ శాంతి నిర్మాణం, సయోధ్య, మానవతా నాయకత్వానికి గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. బోస్టన్ గ్లోబల్ ఫోరం (BGF) ఆయనను “స్వార్థం లేదా పక్షపాతం లేకుండా శాంతికి వారధిగా నిలిచేవాడు” అని అభివర్ణించింది.

READ ALSO: Theft: యువకుడిని పొద్దంతా చెట్టుకు తలక్రిందులుగా వేలాడదీసి.. కారణం అదే!

దేశానికి గర్వకారణం
ఈ అవార్డు గత పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా శాంతి, నైతిక నాయకత్వం, ప్రపంచ భద్రతపై గణనీయమైన ప్రభావాన్ని చూపిన నాయకులను అందజేస్తారు. ఉదాహరణకు 2015లో జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే, జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ 2016లో బాన్ కీ-మూన్, ఇటీవలి సంవత్సరాలలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ అవార్డును అందుకున్నారు. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌కు “వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు 2025” లభించడం దేశానికి గర్వం కారణం. ఇది కేవలం గౌరవం మాత్రమే కాదు, ప్రపంచం ముందు భారతదేశం ఆధ్యాత్మిక, మానవతా నాయకత్వ బలానికి నిదర్శనంగా కొనియాడుతున్నారు. శాంతి, భద్రత, సాంకేతిక ఏకీకరణ యుగంలో, భారతదేశం తనను తాను ప్రపంచ నాయకుడిగా స్థిరపరుచుకుంటుందని ఈ అవార్డు నిరూపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

శ్రీశ్రీ రవిశంకర్ శాంతి ప్రయత్నాలు, మానవతా కార్యక్రమాలు, ప్రపంచవ్యాప్తంగా విస్తరించినందుకు గాను ఈ అవార్డుతో గౌరవించబడ్డారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 180 కి పైగా దేశాలలో ఆయన కార్యక్రమాలు, కొలంబియాలో FARC, ప్రభుత్వానికి మధ్య 52 సంవత్సరాల సంఘర్షణను ముగించడం వంటి వివిధ సంఘర్షణ ప్రాంతాలలో ఆయన జోక్యం, ఇరాక్, శ్రీలంక, మయన్మార్, వెనిజులాలో ఆయన మధ్యవర్తిత్వం వంటి వాటికి ఆయనకు ఈ గౌరవం లభించింది. ఆయన సంస్థ ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్.. శ్వాస ధ్యానం వంటి ఆచరణాత్మక పద్ధతుల ద్వారా ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక గాయాన్ని నయం చేయడానికి, భావోద్వేగాన్ని నియంత్రించడానికి పనిచేస్తుంది. ‘వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు 2025’ అందుకున్న తర్వాత శ్రీ శ్రీ రవిశంకర్ తొలిసారి స్పందించారు.. “శాంతి అనేది కేవలం ఒక పదం కాదు, దానిని ఆచరణలోకి అనువదించాలి” అని ఆయన అన్నారు. “మనం తరచుగా శాంతి భద్రతల గురించి ఒకే ఊపులో మాట్లాడుకుంటాము. భద్రత కోసం చాలా చేస్తారు, కానీ శాంతికి తక్కువ శ్రద్ధ చూపిస్తారు. శాంతిని నిర్మించడం చాలా ముఖ్యం. నేడు మన సమాజాన్ని చుట్టుముట్టిన అపనమ్మకం, సంక్షోభాన్ని శాంతపరచగల నైతిక, ఆధ్యాత్మిక శక్తి మనకు అవసరం” అని ఆయన చెప్పారు.

READ ALSO: Haris Rauf ICC Ban: పాకిస్థాన్ ప్లేయర్ హరిస్ రవూఫ్‌కు ఐసీసీ షాక్.. సూర్యకు కూడా! ఎందుకో తెలుసా..

Exit mobile version