Lord Sri Krishna Art On Pencil Nib: నేడు ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఉదయం పూటనే కృష్ణుని భక్తులు కృష్ణ మందిరాలకు చేరుకుని పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యంగా భారతదేశంలో అనేకమంది భక్తులు ఈ పండుగను పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు. ఇస్కాన్ మందిరాలలో భక్తులు పోటెత్తారు. ఇక మరోవైపు సోషల్ మీడియాలో కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ట్రెండింగ్ గా మారాయి. ఉమ్మడి విశాఖ జిల్లా నక్కపల్లి మండలం చిన్న దొడ్డిగల్లు గ్రామానికి చెందిన వెంకటేష్ తన సూక్ష్మ కళాకార నైపుణ్యంతో అపురూప శ్రీకృష్ణ పరమాత్ముని కళారూపాన్ని చెక్కి అందరితో ప్రశంసలు పొందుతున్నాడు. ఇక ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
మైక్రో ఆర్టిస్టుగా ఎంతో పేరుగా అన్న వెంకటేష్ నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా బాలగోపాల్ రెడ్డి కళారూపం చెక్కి అబ్బురపరిచాడు. పెన్సిల్ ముక్క పై కేవలం 8 మిల్లీమీటర్ల ఎత్తు, 14 మిల్లీమీటర్ల వెడల్పుతో అబ్బురపరిచే శ్రీ కృష్ణ పరమాత్మ రూపాన్ని సృష్టించాడు. చేతిలో మురళి నాదాన్ని, తలపై నెమలి పించం ఉండేలా, ఒంటి కాలిపై నిల్చొని వాయిస్తున్నట్లుగా కళారూపాన్ని సాక్షాత్కరించాడు వెంకటేష్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే మైక్రో ఆర్టిస్ట్ వెంకటేష్ కు ఇదివరకే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానాన్ని సంపాదించారు. అంతేకాకుండా అనేక అవార్డులను కూడా ఆయన సొంతం చేసుకున్నారు. నేడు ఆయన కృష్ణుడిపై ఉన్న భక్తిని ఈ విధంగా చాటుకున్నారు. ఇదివరకు కూడా ఆయన అనేక దేవత విగ్రహాలకు సంబంధించిన సూక్ష్మరూపాలను సృష్టించాడు. నేడు ఆయన వేసిన సూక్ష్మరూపానికి ఐదు గంటల సమయాన్ని వెచ్చించి అద్భుత కలఖండాన్ని సృష్టించాడు.