SRH vs RR: హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు తలపడుతున్నాయి. ఈ కీలక పోరులో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుని, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తాజా పిచ్‌ను ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరాగ్ తెలిపారు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. షిమ్రోన్ హెట్‌మైర్ కు విశ్రాంతి ఇవ్వగా, అతని స్థానంలో ప్రిటోరియస్ జట్టులోకి వచ్చాడు. అలాగే బ్రిజేష్ స్థానంలో తుషార్ దేశ్‌పాండే తిరిగి జట్టులోకి చేరాడు.
IPL 2026: హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్ లపై కన్నెర్ర.. భారీ జరిమానాతో పాటు..?
మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది. హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్ ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. హింగే సహా మరో ఆటగాడు జట్టులోకి వచ్చారు. కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఇషాన్ కిషన్ తన కెప్టెన్సీ అనుభవాన్ని ప్రస్తావిస్తూ జట్టుకు మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ సీజన్‌లో స్థిరమైన ప్రదర్శన చేయలేకపోతున్న SRH, హోమ్ గ్రౌండ్‌లో మంచి స్కోర్ సాధించి తిరిగి ఫామ్‌లోకి రావాలని చూస్తోంది. ఇక పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ తమ విజయ పరంపరను కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ప్లేయింగ్ XI:
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, ఈషాన్ మలింగా, ప్రఫుల్ హింగే.
బెంచ్:
ఆర్ స్మరణ్, సకీబ్ హుస్సేన్, లియామ్ లివింగ్‌స్టోన్, శివమ్ మావి, హర్షల్ పటేల్.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!
రాజస్థాన్ రాయల్స్ (RR) ప్లేయింగ్ XI:
యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్, రియాన్ పరాగ్, లుహాన్-డ్రే ప్రిటోరియస్, డోనోవన్ ఫెర్రేరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే.
బెంచ్:
వైభవ్ సూర్యవంశీ, షిమ్రోన్ హెట్‌మైర్, రవి సింగ్, శుభమ్ దూబే, బ్రిజేష్ శర్మ.
