Site icon NTV Telugu

Sreleela : ఆర్మీ డ్రెస్ లో దసరా శుభాకాంక్షలు తెలిపిన విజ్జి పాప..

Whatsapp Image 2023 10 23 At 7.03.20 Pm

Whatsapp Image 2023 10 23 At 7.03.20 Pm

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో అలరించేందుకు సిద్ధం అయ్యింది. ఇప్పటికే ఆమెకు సంబంధించిన చిత్రాలు వరుసగా విడుదల అవుతున్నాయి.రీసెంట్ గా శ్రీలీలా నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీలో విజ్జి పాప అనే  కీలక పాత్రలో నటించింది. మహిళా సాధికారతకు అద్దం పట్టేలా ఆమె పాత్ర ఉండటం గమనార్హం. ఎంతో కాన్ఫిడెంట్ గా శ్రీలీల ఆ పాత్రలో నటించి మెప్పించింది.ప్రస్తుతం ‘భగవంత్ కేసరి’ కి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఈ మధ్య వచ్చిన పండుగలను టచ్ చేస్తూ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా దసరా పండుగ శుభాకాంక్షలు చెబుతూ శ్రీలీలా ఇంట్రెస్టింగ్ ఫొటోలను పంచుకుంది.

భగవంత్ కేసరి సెట్ లో తనకు సంబంధించిన కొన్ని ఫొటోలను పంచుకుంది. ఆర్మీ యూనిఫాంలో.. యాక్షన్ అవతార్ లో కొన్ని స్టిల్స్ ను షేర్ చేసింది. ఆర్మీ జవాన్ గా శ్రీలీలా లుక్ అదిరిపోయింది. ఆమె బీటీఎస్ పిక్స్ కు అభిమానులు ఎంతగానో ఫిదా అవుతున్నారు. అలాగే దసరా పండుగ సందర్భం గా ట్రెడిషనల్ లుక్ వున్న ఓ ఫొటోను కూడా షేర్ చేసింది. హాఫ్ శారీలో శ్రీ లీల ఎంతో అందంగా కనిపించింది.. బాలయ్య తో కలిసి ఫొటో కు ఫోజిచ్చింది. సంప్రదాయ దుస్తుల్లో శ్రీలీలా వెలిగిపోతుండటం తో అభిమానులు ఎంతో ఖుషీ అవుతున్నారు. ఆమె ఫొటోలను సోషల్ మీడియా లో తెగ వైరల్ చేస్తున్నారు.అయితే, శ్రీలీలా ఇప్పటి వరకు డాన్స్, గ్లామర్ మరియు నటన పరంగా తన టాలెంట్ నిరూపించుకుంది..రీసెంట్ గా విడుదల అయిన రామ్ ‘స్కంద’లో శ్రీలీల ఓ సాంగ్ కూడా పాడింది. ఇక ఆమెను ఆర్మీ లుక్ లో చూసిన కొందరు అభిమానులు యాక్షన్ పాత్రాలు మరిన్ని చేయాలనీ ఆశిస్తున్నారు.

Exit mobile version