Site icon NTV Telugu

Sreeleela : స్టార్ హీరో సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్?

Sreeleela

Sreeleela

టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల గురించి ఎంత చెప్పినా తక్కువే.. మొదటి సినిమాతో స్టార్ రేంజ్ ను సొంతం చేసుకుంది.. ఆ తర్వాత వెనక్కి చూసుకోలేదు.. వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తుంది.. ఈ ఏడాది అమ్మడుకు అంతగా కలిసిరాలేదు.. గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడుకు సినిమా ఆశించిన హిట్ ను అందుకోలేక పోయింది..

ఇప్పుడు పెద్దగా సినిమాల్లో కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారును ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంది.. ఇదిలా ఉండగా ఇప్పుడు ఐటమ్ సాంగ్ లో నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.. తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న చిత్రం గోట్ లో ఈ అమ్మడు ఐటమ్ సాంగ్ చెయ్యనుందని ఓ వార్త షికారు చేస్తుంది..

వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. నటి మీనాక్షి చౌదరి, స్నేహ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, ప్రేమ్‌జీ, మైక్‌ మోహన్‌ తదితరు లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ను శ్రీలీల చెయ్యనుందనే టాక్.. ఆమెతో మేకర్స్ సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం.. ఇదే గనుక నిజం అయితే శ్రీలీల కోలీవుడ్‌ ఎంట్రీ చిత్రం గోట్‌నే అవుతుంది. అలాగే అజిత్ సరసన ఓ సినిమా చెయ్యనుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి..

Exit mobile version