ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్లలో శ్రీ లీల ఒకరు. వరుసగా టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ, సక్సెస్‌లు–ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా తన కెరీర్‌ను సూపర్ స్పీడ్‌లో నడిపిస్తున్న ఈ యంగ్ బ్యూటీ.. తాజాగా అభిమానులను ఆశ్చర్యపరిచే ఒక సర్ప్రైజ్ ఇచ్చింది.
Also Read : Bison : బైసన్ ట్రైలర్ రిలీజ్.. మాస్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన విక్రమ్ వారసుడు ధృవ్
తాజాగా శ్రీలీల తన సోషల్ మీడియాలో ఓ క్రేజీ పోస్టర్ షేర్ చేసింది. అందులో ఆమె “ఏజెంట్ మిర్చి” అనే కొత్త లుక్‌లో కనిపించింది. స్టైలిష్ బ్లాక్ అవుట్‌ఫిట్, కూల్ గాగుల్స్, చేతిలో గన్‌తో ఉన్న ఆమె ఫోటో చూస్తే ఇది సాధారణ ప్రాజెక్ట్ కాదనిపిస్తుంది. ఫ్యాన్స్ మాత్రం “ఇది కొత్త సినిమా పోస్టరా? లేక ఓ వెబ్ సిరీస్ ప్రమోషనా?” అని గెస్ గేమ్ మొదలుపెట్టారు. అలాగే శ్రీలీల ఈ పోస్టర్‌తోపాటు, “October 19న అసలు సీక్రెట్ రివీల్ అవుతుంది” అంటూ హింట్ ఇవ్వడంతో ఆసక్తి మరింత పెరిగింది. దీంతో అభిమానులు ఆ రోజు కోసం కౌంట్‌డౌన్ మొదలుపెట్టేశారు.
మరోవైపు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇది ఒక హిందీ ప్రాజెక్ట్ కావచ్చని టాక్. పాన్ ఇండియా స్థాయిలో శ్రీలీలకు కొత్త అడుగు పడనుందని టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇటీవలే తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఆఫర్లు అందుకుంటున్న శ్రీలీలకు ఈ కొత్త ప్రాజెక్ట్ కెరీర్ టర్నింగ్ పాయింట్ కావచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి.. “ఏజెంట్ మిర్చిగా మారిన శ్రీలీల” అనే ఈ కొత్త లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక అక్టోబర్ 19న ఈ రహస్యం బయటపడే వరకు ఫ్యాన్స్ ఎదురుచూడాల్సిందే!
