యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అతి తక్కువ కాలంలోనే వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ అయ్యింది.. తన డ్యాన్స్ తో, అందంతో వరుస సినిమాలతో మొన్నటివరకు ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు సైలెంట్ గా ఉంది.. ప్రస్తుతం ఈమె చేతిలో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తప్ప మరొక మూవీ లేదు.. ఫ్యాన్స్ ఆమె బ్యాక్ టు బ్యాక్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు..
ఈ ఏడాదిలో చివరగా ఈ అమ్మడు నటించిన సినిమా గుంటూరు కారం.. ఆ సినిమాలో కుర్చీని మడత పెట్టి సాంగ్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.. చాలా మంది రీల్స్ చేస్తున్నారు.. సినిమా వచ్చి మూడు నెలలు అవుతున్నా కూడా ఆ పాట వినిపిస్తూనే ఉంది.. ఇక తాజాగా ఈ అమ్మడు కాలేజీ కుర్రోళ్లతో కలిసి స్టేజ్ మీద కుర్చీని మడత పెట్టి సాంగ్ కు డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఏపీ నెల్లూరులోని కాలేజీ ఫెస్ట్ లో సందడి చేసారు. నెల్లూరులోని ఓ కాలేజీ ఫెస్ట్ కి గెస్ట్ గా వెళ్లిన శ్రీలీల.. అక్కడి స్టూడెంట్స్ తో స్టేజి పై ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ కి డాన్స్ వేసి అదుర్స్ అనిపించారు. ప్రస్తుతం ఆ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇక సినిమాల విషయానికొస్తే.. కొత్తగా సినిమాలకు సైన్ చెయ్యలేదని తెలుస్తుంది..