Doctor Sreeleela: ఎంబీబీఎస్ పూర్తి చేసిన టాలీవుడ్ హీరోయిన్!

Sreeleela Mbbs

Sreeleela Mbbs

Doctor Sreeleela: టాలీవుడ్‌ అందాల తార శ్రీలీల (Sreeleela) ఇకపై కేవలం నటి మాత్రమే కాదు, అధికారికంగా డాక్టర్ కూడా. ఈ బ్యూటీ ఎంతో కష్టపడి చదివి DY పటిల్ మెడికల్ కాలేజీ నుంచి MBBS డిగ్రీని పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 10న జరిగిన కాన్వోకేషన్‌లో ఆమె డాక్టర్ పట్టాను అందుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిన్న వయసులోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన ఈ బ్యూటీ, సినిమా షూటింగ్స్, ప్రమోషన్లు, ట్రావెల్స్ మధ్య డాక్టర్ పట్టాను ఎలా అందుకుందని ఆమె అభిమానులు ఆశ్చపోతున్నారు.

READ ALSO: Thailand: థాయిలాండ్‌లో దారుణం.. చిన్నారులతో సహా 34 మంది మృతి..

×
×
Ad

పుష్ప 2లో ‘కిస్సిక్’ డ్యాన్స్‌తో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. గుంటూరు కారం, భగవంత్ కేసరి వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటిస్తూనే.. మెడికల్ బుక్స్‌తో సమయం గడిపింది. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్‌కు సరిపడా షూటింగ్ షెడ్యూల్స్‌ను అడ్జస్ట్ చేసుకుని, ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా డాక్టర్ పట్టాను అందుకుంది. కాన్వోకేషన్ వీడియోలో.. క్యాప్ పెట్టుకుని స్టేజ్‌పైకి అడుగుపెట్టిన శ్రీలీల ముఖంలో ఆనందం, గర్వం కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీలీలకు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. శ్రీలీల సాధించిన ఈ డాక్టర్ పట్టా కేవలం ఒక మామూలు డిగ్రీ మాత్రమే కాదు, నిజానికి ఇది ఒక సందేశం కూడా అంటున్నారు. సినిమా లాంటి గ్లామర్ ఫీల్డ్‌లో ఉంటూ కూడా విద్యపై దృష్టి పెట్టవచ్చని, రెండు రంగాల్లోనూ టాప్‌లో ఉండవచ్చని శ్రీలీల నిరూపించిందని పలువురు ఆమెను కొనియాడుతున్నారు.

READ ALSO: iProjector 3 Plus: థియేటర్‌కు వెళ్లనవసరం లేదు.. మీ ఇంట్లోనే అదిరిపోయే థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్!