Site icon NTV Telugu

Swag Teaser: హేయ్ శ్రీవిష్ణు.. నువ్వేనా? ఇదేందయ్యా ఇదీ!

Swag Teaser

Swag Teaser

Sree Vishnu, Hasith Goli Swag Teaser Released: కింగ్ అఫ్ కంటెంట్ గా శ్రీవిష్ణుకి నామకరణం చేసింది ‘శ్వాగ్’ టీం. వైవిధ్యమైన పాత్రలతో, ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకునే సబ్జెక్ట్‌లను బ్యాలెన్స్ చేయడంలో పేరుపొందిన శ్రీ విష్ణు సూపర్ హిట్ ‘రాజ రాజ చోర’ తర్వాత డైరెక్టర్ హసిత్ గోలీతో తన సెకెండ్ కొలాబరేషన్ గా ‘శ్వాగ్’ తో అలరించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేకర్స్ ఈరోజు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. శతాబ్దాల క్రితం పురుషుల ఉనికికే ముప్పు పొంచి ఉన్న కాలంలో, వింజామర వంశానికి చెందిన రాణి రుక్మిణీ దేవి పురుషులపై తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకుంది, తనకు ఒక కొడుకు పుడితే చంపడానికి కూడా వెనుకాడదు. అయితే రాజవంశం పై ఒక శాపం చివరికి పరిస్థితి రివర్స్ చేస్తుంది. ఇది క్రమంగా మార్పుకు దారితీస్తుంది. అక్కడ పురుషులు స్త్రీలపై ఆధిపత్యం చెలాయించడం ప్రారంభిస్తారు. శ్రీవిష్ణు, హసిత్ గోలీ కాంబినేషన్‌లో ఎంటర్ టైన్మెంట్ గ్యారెంటీ గా ఉంటుంది.

YVS: 80స్ బ్యాక్ డ్రాప్ లో వైవిఎస్ చౌదరి-నందమూరి తారక రామారావు సినిమా

ఈసారి, వారు యూనిక్ బ్యాక్ డ్రాప్ లో బలమైన కథతో ఎంటర్ టైన్ చేయబోతున్నారు. ఇండియన్ సినిమాలో ఇంతకు ముందు టచ్ చేయని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి, అవి నెక్స్ట్ ప్రమోషనల్ మెటీరియల్‌లో రివిల్ అవుతాయి. శ్రీ విష్ణు…కింగ్, భవభూతి, సింగ, యయాతి వంటి విభిన్నమైన పాత్రలలో అద్భుతంగా అలరించారు. క్వీన్ రుక్మిణీ దేవిగా రీతూ వర్మ మెప్పించింది. టీజర్‌లో మీరా జాస్మిన్, సునీల్, దక్షనాగార్కర్, శరణ్య ప్రదీప్ వంటి ఇతర పాత్రలు కూడా కీలకంగా ఉన్నాయి. వేద రామన్ శంకరన్ కెమెరా పనితనం ఇంపాక్ట్ ఫుల్ గా ఉంది, వివేక్ సాగర్ ఆకట్టుకునే స్కోర్‌తో ప్రతి ఎలిమెంట్‌ను ఎలివేట్ చేశాడు. జిఎం శేఖర్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ని నిర్వహిస్తుండగా, నందు మాస్టర్ స్టంట్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. క్రేజీ అండ్ ఫన్ ఫుల్ టీజర్ విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలను పెంచింది.

Exit mobile version