NTV Telugu Site icon

Union Budget 2023: బడ్జెట్‌లో క్రీడారంగానికి భారీ నిధులు..అందుకోసమేనా!

Spo1

Spo1

2023-2024 కేంద్ర బడ్జెట్‌లో క్రీడా రంగానికి తగిన ప్రాధాన్యం లభించింది. క్రీడాకారులకు గుడ్‌ న్యూస్ చెప్పిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భారీ కేటాయింపులు చేసింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈసారి బడ్జెట్‌ కేటాయించారు. వచ్చే ఏడాది జరగనున్న ఒలింపిక్స్‌తో పాటు ఈ ఏడాది జరగనున్న ఆసియాన్ గేమ్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు ఈసారి 3,397.32 కోట్ల రూపాయలు ఇచ్చారు. గతేడాదితో పోల్చితే 358కోట్ల రూపాయల నిధులను పెంచారు నిర్మలమ్మ. గతేడాది 2022-23బడ్జెట్‌లో క్రీడలకు రూ.3,062.60కోట్లు కేటాయించారు. 2017-18లో రూ.1943కోట్లు, 2018-19లో రూ.2197కోట్లు, 2019-20లో రూ.2776కోట్లు, 2020-21లో రూ.2826కోట్లు, 2021-22లో 2596కోట్లు.. ఇక గతేడాది 3వేల కోట్ల మార్కును టచ్‌ను చేసిన క్రీడా బడ్జెట్ ఈ సారి 3,397 కోట్ల రూపాయలకు పెరిగింది.

Hanuma Vihari: ఏం డెడికేషన్ గురు .. మణికట్టుకు గాయమై ఒంటిచేత్తో విహారి బ్యాటింగ్

క్రీడల అభివృద్ధిలో భాగంగా క్రీడాకారులకు నేషనల్ క్యాంప్‌లు, శిక్షణ, మౌలిక వసతుల కల్పన, శిక్షణ కార్యాలయాల్లో వసతులు, సరికొత్త క్రీడా సామగ్రి ఏర్పాటు తదితర అవసరాల కోసం కేంద్ర క్రీడాశాఖ ఈ మొత్తాన్ని ఖర్చు చేయనుంది. అయితే స్పోర్ట్స్ బడ్జెట్‌ను గతం కంటే భారీగా పెంచిన కేంద్రం.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-సాయ్‌ను మాత్రం చిన్నచూపు చూసినట్లు కనిపిస్తోంది. ఖేలో ఇండియాకు ఏకంగా 1,045 కోట్ల రూపాయలు కేటాయించిన నిర్మలా.. సాయ్‌కు మాత్రం 785కోట్ల రూపాయలతో సరిపెట్టింది. నిజానికి ప్రతి ఏడాది సాయ్‌ కంటే ఖేలో ఇండియాకే ఎక్కువ నిధులు కేటాయిస్తుంది కేంద్రం. క్రీడా రంగ అభివృద్ధికి సంబంధించి ఖేలో ఇండియాకు నిధుల పెంపు సానుకూల సంకేతం అయినప్పటికీ.. సాయ్, జాతీయ క్రీడా సమాఖ్యలకు నిధులు తక్కువ కేటాయించడంపై విమర్శలు వ్యక్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా క్రీడా మౌలిక సదుపాయాల ఏర్పాటు, పరికరాలను అందించడం, జాతీయ శిబిరాలను నిర్వహించడానికి సాయ్ నోడల్ సంస్థగా ఉంది. అలాంటి సాయ్‌కు స్థాయికి తగినట్లుగా నిధులు కేటాయింపు జరిగిందా అనే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి నెలకొంది. అటు నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్‌కు రూ.325 కోట్లు నేషనల్ సర్వీస్ స్కీమ్‌కు కూడా 325 కోట్లు.. నేషనల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఫండ్‌కు రూ.15 కోట్లు కేటాయించారు.

Nama Nageswara Rao: ఇది రైతు వ్యతిరేక బడ్జెట్.. పార్లమెంట్‌లో దీన్ని వ్యతిరేకిస్తాం

Show comments