Site icon NTV Telugu

Spirit vs Invincibles: క్రికెట్ గ్రౌండ్లో ప్రత్యక్షమైన నక్క.. రచ్చ రచ్చ చేసిందింగా! వైరల్ వీడియో

Rasid Fox

Rasid Fox

Spirit vs Invincibles: మెన్స్ హండ్రెడ్ టోర్నమెంట్‌లో ఆగస్టు 5 (మంగళవారం) నాడు లార్డ్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టు 6 వికెట్ల తేడాతో లండన్ స్పిరిట్‌ను ఓడించింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో ఒక నక్క మైదానంలోకి ప్రవేశించి గందరగోళం సృష్టించింది. అది ఫీల్డ్‌లో పరుగులు పెడుతూ కాసేపు అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సమయంలో మ్యాచ్‌కు కొంత సేపు అంతరాయం కలిగింది.

iPhone 17: ఐఫోన్ లవర్స్ డబ్బులు రెడీ చేసేసుకోండి.. అతి త్వరలో iPhone 17 విడుదల.. ధర, ఫీచర్స్ ఇలా!

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లండన్ స్పిరిట్ జట్టు కేవలం 94 బంతుల్లో 80 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఇన్విన్సిబుల్స్ జట్టు 69 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించి 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. రషీద్ ఖాన్ అద్భుత బౌలింగ్‌తో (3 వికెట్లు, 3 క్యాచ్‌లు) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. లండన్ స్పిరిట్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ కేన్ విలియంసన్, వార్నర్, జెన్నింగ్స్ రాణించలేకపోయారు. అష్టన్ టర్నర్ (21) మినహా మరెవ్వరూ 20 పరుగులు కూడా చేయలేకపోయారు. రషీద్ ఖాన్ 20 బంతుల్లో 3 వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశాడు. సామ్ కరన్ కూడా 3 వికెట్లు తీసి సహకారం అందించాడు. దీనితో లండన్ స్పిరిట్‌ టిమ్ మొత్తం 80 పరుగులకు ఆలౌట్ అయింది.

RBI REPO Rate: రెపో రేటులో మార్పు లేదు.. ఆర్బీఐ కీలక ప్రకటన!

ఇక లక్ష్య ఛేదనలో విల్ జాక్స్ (24), తవండ ముయెయే (18) మంచి ఆరంభం ఇచ్చారు. ఆ తర్వాత సామ్ కరన్ (14), ఫెరెరా (9*) హిట్టింగ్‌తో 69 బంతుల్లోనే 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేరుకున్నారు. ఇక బౌలింగ్ లో లియామ్ డాసన్ 2 వికెట్లు నేలకూల్చాడు.

Exit mobile version