ఆకు కూరల్లో పాలకూర వేరయా.. ప్రత్యేకమైన రుచి.. ఇంకా పోషక విలువలను కలిగి ఉంటుంది.. శరీరానికి రక్తం పట్టడానికి పాలకూరను ఎక్కువగా తినమని చెప్తుంటారు. ఇందులో ఉండే ఫైబర్, ఖనిజలవణాల వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనం ఉంటుంది. మార్కెట్ లో డిమాండ్ ఉన్న ఆకుకూరల్లో పాలకూర ఒకటి… అందుకే రైతులు వీటిని ఎక్కువగా పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. అయితే పాలకూర సాగులో అధిక దిగుబడి పొందాలంటే మాత్రం ముందుగా మేలైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.. ఇప్పుడు పాలకూరలో మేలైన రకం విత్తనాల గురించి తెలుసుకుందాం..
జాబనర్ గ్రీన్..
ఆకుపచ్చని, దళసరి, మెత్తని ఏకరీతి ఆకులు ఈ రకం ప్రత్యేకం. సువాసన వస్తుంది. ఎకరాకు దిగుబడి 108 క్వింటాళ్లకు పైగా వస్తుందని నిపుణులు అంటున్నారు..
పూసా హరిత్..
ఈ రకం చల్లని ప్రాంతాల్లో సాగుకు అత్యంత అనువైనది. వెడల్పాటి ఆకులు కలిగి ఉంటుంది. త్వరగా విత్తనం ఏర్పడదు. అధిక దిగుబడినిచ్చే రకాల్లో ఇది ఒకటి. విత్తిన 20 రోజుల నుండి ప్రతి 15 రోజలుకు ఒకసారి కలుపు నివారణ, అంతరకృషి చేయాలి. విత్తిన వెంటనే తేలికపాటి నీటి తడులివ్వాలి. మూడో రోజు నుండి 7 రోజులకొకసారి నీటి తడులివ్వాలి. నాటిన 5 నుండి 8వారాల త్వరాత ఆకులు కోతకు వస్తాయి..
పూసా పాలక్..
ఈ రకం పాలకూర పచ్చని మెత్తని ఆకులనిస్తుంది. విత్తే సమయాన్ని బట్టి ఆరుకోతల వరకు తీసుకోవచ్చు.. ఈ రకం ఎకరాకు 50 క్వింటాల దిగుబడి ఇస్తుంది..
అనువైన నేలలు..
పాలకూరలో ఉష్ణ ప్రాంతపు పంట. చలి, కొంతమేరకు మంచును తట్టుకుంటుంది. నీరు నిలిచే భూముల్లో ఈ పంట సాగు చేయకపోవటమే మంచిది.. నీళ్ల వసతి బాగుంటే ఎప్పుడైనా ఈ పంటను సాగు చేసుకోవచ్చు.. ఎకరాకు 11 కేజిల విత్తనాలు అవసరం అవుతాయి.. ఈ పంట సాగు గురించి ఏదైనా సందేహాలు ఉంటే వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..