Medaram Jatara : మేడారం వెళ్లే భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈనెల 21న మహాజతర జరుగనున్న నేపథ్యంలో ప్రత్యేక జన సాధారణ రైళ్లు నడపనున్నట్లు సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు ఐదు రోజుల పాటు, అలాగే నిజామాబాద్ నుంచి వయా సికింద్రాబాద్, వరంగల్ మధ్య 4 రోజుల పాటు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటుగా కాగజ్ నగర్ నుంచి వరంగల్ వరకు మరో ప్రత్యేక రైలు అందుబాటులో ఉందన్నారు. రైల్వే స్టేషన్ నుంచి నేరుగా మేడారానికి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతున్నందున భక్తులకు ప్రయాణం సుగమం అవుతుందని.. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని క్షేమంగా దర్శనం చేసుకుని ఇళ్లకు తిరిగి వెళ్లాలని రైల్వే అధికారులు కోరారు.
07017/07018: సిర్పూర్ కాగజ్‌నగర్-వరంగల్-సిర్పూర్ కాగజ్‌నగర్
07014/07015: సికింద్రాబాద్-వరంగల్-సికింద్రాబాద్
07019/07020: నిజామాబాద్-వరంగల్-నిజామాబాద్
Read Also:TDP: టీడీపీలో బుజ్జగింపుల పర్వం..! వారికి నో టికెట్స్..!
‘నరేంద్రమోడీ ప్రభుత్వం, గిరిజన సంస్కృతి, సంప్రదాయాల విషయంలో, గిరిజన సమాజం సంక్షేమం విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తోంది. అందులో భాగంగానే.. సమ్మక్క-సారక్క జాతరకు ప్రత్యేక రైళ్లు వేయడంతోపాటుగా జాతర ఏర్పాట్లకోసం రూ.3కోట్లను కేటాయించింది’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
