Site icon NTV Telugu

Health Policy: మీరు షుగర్ పేషంట్లైతే వెంటనే ఈ స్పెషల్ హెల్త్ పాలసీ తీసుకోండి

Sugar Patients

Sugar Patients

Health Policy: షుగర్ వ్యాధి ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. మారిన జీవన విధానాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.చిన్న పిల్లలకు కూడా షుగర్ వ్యాధి వచ్చేస్తోంది. అందువల్ల హెల్త్ పాలసీ తీసుకోవడం మంచింది. దీంతో జేబుకు చిల్లు పడకుండా చూసుకోవచ్చు. ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ గణాంకాల ప్రకారం.. షుగర్ లేదా షుగర్ సంబంధిత ఇతర కారణాల వల్ల ప్రతి ఏడు సెకన్లకు ఒకరు చనిపోతున్నారు. ఇలా మరణిస్తున్న వారిలో 60 ఏళ్లలోపు మందే 50 శాతం ఉండటం గమనార్హం. భారత్‌లో 2017 నాటికే 7.2 కోట్ల మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. 2040 నాటికి ఈ సంఖ్య 12.3 కోట్లకు చేరొచ్చనే అంచనాలున్నాయి.

Read Also: Love Marriage: ఆర్మూరు ‘ఆకాష్’.. అమెరికా ‘ఓల్సా’.. ఒక్కటైన ప్రేమజంట

డయాబెటిక్ పేషంట్లు కుటుంబ ఆదాయంలో 5 శాతాన్ని డయాబెటిక్ కేర్ కోసం ఖర్చు చేస్తున్నారు. గవర్నరమెంట్ హెల్త్ ఫెసిలిటీలో సంవత్సరానికి ఈ వ్యాధి కోసం ఒక్కోక్కరికి దాదాపు రూ.8,958 ఖర్చవుతోంది. డయాబెటిక్ కేర్ ఖర్చులు ఇటీవల కాలంలో భారీగా పెరిగాయి. షుగర్ వ్యాధికి దీర్ఘకాల ట్రీట్‌మెంట్ అవసరం. దీంతో ఖర్చులు మరింత పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. గుండె పోటు, కిడ్నీ వ్యాధి వంటి వాటికి కూడా షుగర్ కారణంగా కావొచ్చు. డయాబెటిక్‌ వ్యాధిని ఎదుర్కొనేందుకు సమగ్రమైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం మంచిది. దీంతో మీకు డబ్బులు ఆదా కావడంతోపాటు నచ్చిన హాస్పిటల్‌లో వైద్యం చేయించుకోవచ్చు. మార్కెట్‌లో ప్రస్తుతం చాలా డయాబెటిక్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. మీ అవసరాలకు అనుగుణమైన పాలసీ తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇన్‌స్టంట్ డయాబెటిక్ కవరేజ్ పాలసీలు కూడా ఉన్నాయి.

Read Also: Cyber Cheating: బాసర పేరుతో భారీ దందాకు తెరతీసిన సైబర్ కేటుగాళ్లు

తాజాగా ప్రైవేట్‌ రంగ బీమా సంస్థ ఐసిఐసిఐ ప్రూడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఇటీవీల మధుమేహ రోగుల కోసం ప్రత్యేకంగా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ ప్రారంభిస్తున్నది. డయాబెటిస్‌ కేర్‌ పేరుతో ప్రారంభిస్తున్న ఈ స్కీమ్‌ తొలి దశలో పన్నెండు నగరాల్లో ప్రారంభిస్తున్నారు. బీమా రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథార్టీ నుంచి కొద్దిరోజుల క్రితమే అనుమతి లభించినట్టుగా ప్రూడెన్షియల్‌ ఐసిఐసిఐ సిఇవో, ఎండి శిఖా శర్మ వెల్లడించారు. ప్రపంచంలోని మధుమేహ వ్యాధి గ్రస్తుల్లో ఇరవై శాతం మంది భారత్‌లోనే ఉన్నారని ప్రపంచానికి డయాబెటిస్‌ కాపిటల్‌గా భారత్‌ను పరిగణిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులకు సరైన సంరక్షణ, ఆర్థిక మద్దతు అందించాలనే లక్ష్యంతో ఈ స్కీమ్‌ ప్రారంభించినట్టు ఆయన చెప్పారు.

Exit mobile version